క్రీస్తురాజు పుణ్యక్షేత్ర తీర్థ యాత్ర మహోత్సవము

క్రీస్తురాజు పుణ్యక్షేత్ర తీర్థ యాత్ర మహోత్సవము

విశాఖ అగ్రపీఠం, క్రీస్తురాజుపురం, యర్రసామంతవలస గిరిజన  విచారణ లో రాబోవు
క్రీస్తురాజు పుణ్యక్షేత్ర తీర్థ యాత్ర మహోత్సవము మరియు  పుణ్యక్షేత్ర ఆవిర్భావ ద్వితీయ వార్షికోత్సవ పండుగ కార్యక్రమాలను విడుదల చేసారు. పండుగ కార్యక్రమాలు  తేది 14-11-2023  మంగళవారం నుండి 23-11-2023 గురువారం వరకు జరగనున్నాయి అని విశాఖ అతిమేత్రాసన ఆధ్యాత్మిక గురువులు , విచారణ కర్తలు  గురుశ్రీ పువ్వల జీవన్ బాబు గారు తెలిపారు.

23-11-2023 గురువారం  క్రీస్తురాజు పుణ్యక్షేత్ర తీర్థ యాత్ర మహోత్సవము ఘనంగా జరగనున్నది. ఆ రోజున ఉదయం 10  గంటలకు నూతన పుణ్యక్షేత్ర  క్రీస్తురాజు ప్రార్థనాలయము  ప్రతిష్టోత్సము  విశాఖ అగ్రపీఠాధిపతులు మహా పూజ్య మల్లవరపు ప్రకాష్ గారిచే  జరగనున్నది.అనంతరం  దివ్యబలి పూజ జరగనున్నది. మధ్యాహ్నం 2 గంటలకు క్రీస్తురాజు తేరు తో మహా ప్రదక్షణ జరగనున్నది. 3 గంటలకు  దివ్యసత్ప్రసాద ఆరాధన మరియు దైవ వాక్య పరిచర్యను గురుశ్రీ మైచర్ల జేసుదాసు గారు   ప్రజలకు అందించనున్నారు. శాంసన్ మరియు డెలిల బుర్రకథను ఏర్పాటు చేసినట్లు విచారణ కర్తలు తెలిపారు.   

 ఈ విచారణ  పార్వతీపురం మన్యం జిల్లా  క్రీస్తురాజుపురం (పనసభద్ర)లో ప్రకృతి అందాలతో చుట్టూ కొండలు, కోనలు, వాగులు, వంకలు మధ్య 1984 సంవత్సరములో ఫా. పీటర్ సబాస్టీన్ గారికి దేవుడిచ్చిన ప్రేరణతో ఆరంభమై పలు గురువులు, డీకన్లు, కన్యస్త్రీల సేవలతో విశ్వాస పథంలో నడిచి... తేది 19-11-2021 క్రీస్తురాజు పేరుతో ఆవిర్భవించింది ఈ పుణ్యక్షేత్రం.

 ఆవిర్భవించిన క్షణం నుండి ఎన్నో వేల మంది భక్తులు ఆశీర్వాదాల నిమిత్తమై విశ్వాసులు కోరిన కోర్కెలు తీర్చే దేవుని సన్నిధికి తరలి వస్తున్నారు. నేడు ద్వితీయ వార్షికోత్సవం జరుపుకుంటున్న శుభ తరుణములో “క్రీస్తురాజు ప్రార్థనాలయం” ప్రారంభోత్సవం జరుగుచున్నది.

పండుగను పురష్కరించుకుని గురుశ్రీ పువ్వల జీవన్ బాబు గారు ప్రజలందరినీ ఆహ్వానిస్తూ   'అడుగుడు ఇవ్వబడును. వెదకుడు లభించును, తట్టుడు తెరువబడును' అను మన క్రీస్తురాజు ఇచ్చిన వాగ్దానమును హృదయమున నిలిపి, ఆయన దరిచేరి, ఆయన దీవెనలను పొందాలని కోరారు.

Add new comment

9 + 4 =