కొత్త వేరియంట్ ‘ఒమ్రికాన్’ !

కొత్త వేరియంట్ ‘ఒమ్రికాన్’ !

‘ఒమ్రికాన్’లో  పెద్ద సంఖ్యలో మ్యుటేషన్స్  ఉన్నాయని, డెల్టా కంటే ఇది ప్రమాదకారి కావచ్చని  నిపుణులు కలవరపడుతున్నారు. ముందుగా  దక్షిణాఫ్రికాలో ఈ కొత్తరకం వేరియంట్‌  వెలుగుచూసింది. బోత్సువానా, బెల్జియం, హాంకాంగ్‌, ఇజ్రాయెల్ దేశాల్లో కూడా దీన్ని గుర్తించారు. ఈ వేరియంట్‌ లో  వ్యాప్తి చెందే  లక్షణాలు తీవ్రంగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)ప్రకటించింది. ఒమిక్రాన్ అని పేరు పెట్టక ముందు ఈ వేరియంట్‌ను బి.1.1.529గా పిలిచారు.

దక్షిణాఫ్రికాలో ఈ కొత్త రకం వేరియంట్ కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నట్లుగా కనిపిస్తోందని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. దక్షిణాఫ్రికాలో సగటున రోజూ 200 మంది కరోనా బారిన పడుతున్నారు.

దక్షిణాఫ్రికా నుంచి రాకపోకలను నిషేధించాలని పలు దేశాలు నిర్ణయించుకున్నాయి.యూకేతో పాటు యూఎస్, ఈయూ దేశాలు, స్విట్జర్లాండ్ తదితర దేశాలు, దక్షిణాఫ్రికాలోని కొన్ని దేశాలకు విమాన రాకపోకలను తాత్కాలికంగా నిలిపేశాయి.

Add new comment

13 + 1 =