కైలాసపురం విచారణ

జాతీయ యువత ఆదివారం

జాతీయ యువత ఆదివారం సందర్భముగా  కైలాసపురం విచారణ ,వేలాంగణిమాత దేవాలయం లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురుశ్రీ మాముద్దు చిన్నన్న CMF, AP&TS ప్రాంతీయ యువ సమన్వయకర్త గారి ఆద్వర్యం లో  దివ్యపూజ బలి జరిగినది. అనంతరం  విచారణ యువతీ,యువకులు  సదస్సు  నిర్వహించారు .  అందులో భాగంగా  "యువత  జీవితం  దేవుని  పట్ల ఏ  విధంగా  ఉంది అనే దాని మీద మాట్లాడడం జరిగింది.  అలాగే  యువత  శ్రీసభ కు  సైనికుల  లాగా  ఉండాలని, శక్తివంతమైన  జీవితం  జీవించాలి  అని సూచించారు.   సామజిక  మాధ్యమాలుని  పాజిటివ్ గా  వాడేలా  తగు జాగ్రత్తలు తీసుకోవాలని  సదస్సులో  చెప్పారు.  తరువాత  భాగంలో  యువతీ, యువకులకు  ఆటలపోటీలు ఏర్పాటు  చేసి  సదస్సుని  మరింత  ఉత్సాహం గా  మార్చారు . సుమారు  50 మంది యువతీ,యువకులు  ఈ  కార్యక్రమం లో  పాల్గొన్నారు. ప్రెసిడెంట్  రంజీ  ఆద్వర్యం లో  యువతంతా ఏకమై  ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసారు. విచారణ  గురుశ్రీ  సేవి  గారికి మరియు సహాయ గురుశ్రీ  జేస్సిన్ గారికి యూత్  అందరి  తరుపున  నిర్మల  మరియు  అశోక్  కృతజ్ఞతలు తెలిపారు. విచారణ యువతకు  మార్గచూపరి గా  నిలిచినా సీనియర్ నాయకుడు ఆనంద్ కూడా ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు .

Add new comment

1 + 13 =