కృష్ణవరం సహాయమాత మహోత్సవములు.

విజయవాడ మేత్రాసనం, మల్లవల్లి విచారణ, కృష్ణవరం గ్రామమునందు నిత్య సహాయమాత మహోత్సవములు మే 9, 2022న ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ మహోత్సవాలు ప్రతీ సంవత్సరం మే 9, 10, 11 తేదీలలో జరుపుకుంటారు.

విజయవాడ  మేత్రాసన కాపరి మహా పూజ్య. తెలగతోటి రాజా రావు తండ్రిగారు, ఇతర గురువులతో కలిసి సమిష్టి దివ్యబలిపూజతో ఈ మహోత్సవాలను ప్రారంభించారు.

19 మంది చిన్నారులు నూతనంగా దివ్య సత్ప్రసాదమును స్వీకరించారని విచారణ కర్తలు గురుశ్రీ సునీల్ CM గారు తెలిపారు.

ఈ దివ్యబలి పూజలో భక్తులు సంతోషంగా పాల్గొని ఆ మరియ తల్లి ఆశీస్సులు పొందుకున్నారు.

విచారణ కర్తలు గురుశ్రీ సునీల్ CM గారు విచ్చేసిన పీఠాధిపతులవారిని, గురువులను,  విచారణ సంఘపెద్దలను, కృష్ణవరం సంఘస్తులను కృతజ్ఞతలు తెలిపి అభినందించారు.

మల్లవల్లి విచారణను ఆ మరియ తల్లి ఎల్లప్పుడు దీవించాలని అమృతవాణి రేడియో వెరితాస్ ఆసియ తెలుగు విభాగం వారు కోరుకుంటున్నారు.

Add new comment

1 + 8 =