కాల్పులలో గాయపడ్డ మెక్సికన్ కథోలిక గురువు

 కథోలిక గురువుగురుశ్రీ వెలెజ్ జిమెనెజ్

ఒక మెక్సికన్ కథోలిక గురువు దక్షిణ మెక్సికోలోని గెరెరో రాష్ట్రంలోని హైవేపై జరిగిన కాల్పులలో  గాయపడ్డారని మెక్సికన్ కౌన్సిల్ ఆఫ్ బిషప్స్ ఒక అధికార ప్రకటనలో పేర్కొంది.

మోటారు సైకిల్‌పై వచ్చిన ముష్కరులు గురుశ్రీ వెలెజ్ జిమెనెజ్ గారి వాహనం వద్దకు వచ్చి ఆయనపై కాల్పులు జరిపారు. ఈ సంఘటన హింసాకాండతో అట్టుడుకుతున్న చిలపా పట్టణానికి సమీపంలో జూలై 28న జరిగింది.

వెలెజ్ జిమెనెజ్ చెంపపై కాల్చబడ్డాడు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఆయన ఇప్పుడు ప్రమాదం నుండి బయటపడ్డారని ఆసుపత్రిలో కోలుకుంటున్నారని గెరెరో స్టేట్ ప్రాసిక్యూటర్ విలేఖరులతో అన్నారు.

ఫాదర్ జిమెనెజ్ చిల్పాన్సింగ్-చిలాపా మేత్రాసనంలోని ఇగ్వాలా పట్టణంలోని సెయింట్ గెరార్డ్ మరియా మజెల్లా విచారణకు విచారణ గురువుగా పనిచేస్తున్నారు.

చివావా పర్వతాలలో ఇద్దరు జేసు సభ గురువులు మరియు ఒక టూర్ గైడ్ చంపబడిన ఒక నెల తర్వాత ఈ సంఘటన చోటు చేసుకుంది. జూన్ 20 న ఒక టూర్ గైడ్ ను స్థానిక డ్రగ్స్ ముఠా నాయకుని నుండి కాపాడే ప్రయత్నంలో ఆ  ఇద్దరు జేసు సభ గురువులు  హతులైయ్యారు. 

దేశవ్యాప్తంగా ఉన్న విచారణలు గత నెల రోజులనుండి బాధితులు కోసం మరియు హింసకు పాల్పడిన వారందరి కోసం ప్రార్ధనలు చేస్తున్నారు. 

కాథలిక్ మల్టీమీడియా సెంటర్ వారు విడుదలచేసిన నివేదిక ప్రకారం,  ప్రస్తుత పరిపాలనలో ఏడుగురు గురువులు మరియు మునుపటి పరిపాలనలో కనీసం ఇరవైనాలుగు మంది మరణించారు.

Add new comment

8 + 5 =