కార్డినల్ హోదాను నిరాకరించిన పీఠాధిపతి 

కార్డినల్మహా పూజ్య. లుక్ వాన్ లూయి

29 మే 2022 న జగద్గురువులైన ఫ్రాన్సిస్ పాపు గారు 21 మందిని నూతన కార్డినళ్ళుగా ప్రకటించారు. వీరందరూ 27 ఆగష్టు 2022 న అభిషేకించబడనున్న నేపథ్యంలో వీరిలో ఒకరు ఈ హోదాను నిరాకరించారు.

బెల్జియం కు చెందిన  మహా పూజ్య. లుక్ వాన్ లూయి గారు కార్డినల్ గా ఎన్నికైన 21 మందిలో ఒకరు. అయితే ఆయన ఈ హోదాను మర్యాదపూర్వంకగా నిరాకరిస్తూ, తన అభ్యర్ధనను సహృదయంతో అంగీకరించాలని ఫ్రాన్సిస్ పాపు గారికి ఒక లేఖ పంపారు. ఆయన ఉన్న మేత్రాసనంలో జరిగిన కొన్ని సంఘటనల దృష్ట్యా ఆయన ఈ హోదాను నిరాకరిస్తున్నట్లు పాపు గారికి పంపిన లేఖలో పేర్కొన్నారు.

మహా పూజ్య. లుక్ వాన్ లూయి గారి లేఖను అందుకున్న ఫ్రాన్సిస్ పాపు గారు ఆయన అభ్యర్ధనను  అర్ధం చేసుకొని సహృదయంతో దానిని అంగీకరిస్తున్నట్లు ప్రకటించారు.

కార్డినల్ హోదా అంటే ఒక గొప్ప బాధ్యత. ఆ హోదా దక్కడం ఒక గొప్ప వరంగా భావిస్తారు పీఠాధిపతులు. తాను పని చేసిన మేత్రాసనం లో జరిగిన కొన్ని అవాంఛనీయ సంఘటనలకు తానే బాధ్యత వహిస్తూ అటువంటి హోదాను తృణప్రాయంగా త్యజించారు.

Add new comment

17 + 1 =