కార్డినల్ జోజెఫ్ టోమ్కో గారిని అభివర్ణించిన ఫ్రాన్సిస్ పాపు గారు

 ఫ్రాన్సిస్ పాపు గారు లేట్ కార్డినల్ జోసెఫ్ టోమ్కో గారిని గొప్ప విశ్వాసం మరియు వివేకం గల వ్యక్తిగా అభివర్ణిస్తూ, ప్రజల సువార్తీకరణ కోసం ప్రధాన వాటికన్ కార్యాలయాలలో కాంగ్రిగేషన్ యొక్క ప్రిఫెక్ట్ ఎమెరిటస్‌గా టోమ్కో గారి 'దీర్ఘమైన మరియు ఫలవంతమైన సేవ'ను గుర్తు చేసుకున్నారు.

"గాఢమైన విశ్వాసం మరియు దూరదృష్టితో, సువార్త మరియు దేవాలయానికి వినయంతో,స్వయంత్యాగ సేవ చేసిన ఈ గౌరవనీయమైన సహోదరుడిని స్మరించుకోవడంలో, సుదీర్ఘమైన మరియు ఫలవంతమైన కృషికి కృతజ్ఞతగా నేను భావిస్తున్నాను అని పాపు గారు తెలియజేశారు.  

స్లోవేకియన్ కార్డినల్ జోజెఫ్ టోమ్కో గారు, ఒక ప్రమాదంలో పడిపోవడం వల్ల గర్భాశయ వెన్నెముకకు గాయం కావడంతో ఆయన గెమెల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆగష్టు 8, సోమవారం రోజున , 98 సంవత్సరాల వయస్సులో రోమ్‌లో మరణించారు.

 

Article by

K.Chandana Pramada

RVA Telugu Service

Add new comment

4 + 16 =