కార్టూన్ల ద్వారా సువార్త ప్రచారం  - నేటి తరంలో టాబోర్ ప్రొడక్షన్స్ వారి పరిచర్య 

కార్టూన్ల ద్వారా సువార్త ప్రచారంటాబోర్ ప్రొడక్షన్స్

టాబోర్ ప్రొడక్షన్స్ జనరల్ మేనేజర్‌గా, ఇజ్రాయెల్ అరీనాస్ చిన్నప్పటి నుండి 

కార్టూన్‌ల ద్వారా సువార్త ప్రకటించాలనే తన చిన్ననాటి కలను టాబోర్ ప్రొడక్షన్స్ జనరల్ మేనేజర్‌, ఇజ్రాయెల్ అరీనాస్ నెరవేర్చుకోగలిగారు.

పునీత జోసెఫ్ కలాసాంజ్ లేదా డానియెల్ కాంబోని వంటి గొప్ప వ్యక్తుల జీవితాలను కార్టూన్ చిత్రాలుగా ఆయన ప్రపంచానికి అందించారు.

క్రైస్తవ జీవితం యొక్క గొప్పతనానికి, ఆధ్యాత్మికత యొక్క విలువకు, క్రీస్తును పోలిన సేవకు సాక్షులుగా ఉన్న వ్యవస్థాపకులు మరియు ఆదర్శప్రాయమైన వ్యక్తుల జీవితాల గురించి చెప్పే చిత్రాలు మనకు తక్కువగా ఉన్నాయని నేను భావిస్తున్నాను అని టాబోర్ ప్రొడక్షన్స్ జనరల్ మేనేజర్  ఇజ్రాయెల్ అరేనాస్ అన్నారు.

టాబోర్ ప్రొడక్షన్స్ 2006లో స్థాపించబడింది నేటి వరకు వారి కార్టూన్ చిత్రాలు ఏడు కంటే ఎక్కువ భాషల్లోకి అనువదించబడ్డాయి. మతపరమైన యానిమేషన్‌లో నైపుణ్యం కలిగిన ప్రపంచంలోని కొన్ని కంపెనీలలో ఇది ఒకటిగా మారింది.

ప్రపంచంలోని అనేక ప్రాంతాల నుంచి మాకు గుర్తింపు వచ్చింది. వీడియోలను ఆన్‌లైన్‌లో చాలా మంది వ్యక్తులు వీక్షించారు మరియు అత్యంత సాధారణ భాషల్లోకి అనువదించబడ్డారు, ఉదాహరణకు జపనీస్, థాయ్, క్రొయేషియన్ మరియు అరబిక్ వంటి ఇతర సాధారణ భాషల్లోకి కూడా అనువదించబడ్డాయి అని ఇజ్రాయెల్ అరేనాస్ తెలియజేసారు.

ఈ చిత్రాలను చూసే వీక్షకులు అందులో పాత్రలను గుర్తించగలగడం, మరియు వాటి ద్వారా ప్రేరణను పొందడం మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని అది వారికి ఎంతో దీవెనకరం అని ఇజ్రాయెల్ అరేనాస్ గారు అభిప్రాయపడ్డారు.

అరేనాస్, టాబోర్ ప్రొడక్షన్స్ మతపరమైన కార్టూన్‌లను సృష్టించి వార్తి ద్వారా ఆధ్యాత్మిక జీవితంలో ప్రజలందరినీ బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.

Add new comment

2 + 0 =