కారుణ్య మరణాన్ని చట్టబద్దం చేసిన ఆస్ట్రేలియా - వ్యతిరేకిస్తున్న కథోలిక సమాజం

కారుణ్య మరణాన్ని వ్యతిరేకిస్తున్న కథోలిక సమాజంఆస్ట్రేలియా

మన కాలంలోని అత్యంత ముఖ్యమైన నైతిక సమస్యలలో ఒకటి ఆస్ట్రేలియా శాసనసభలో మరోసారి చర్చనీయాంశమైంది.

గత మూడు సంవత్సరాల్లో, మొత్తం ఆరు ఆస్ట్రేలియన్ రాష్ట్రాలు కారుణ్య మరణాలను చట్టబద్దం చేసాయి. ఇటీవల ప్రవేశపెట్టిన ఒక బిల్లు ప్రకారం మరో రెండు రాష్ట్రాలకు కారుణ్య మరణాలను చట్టబద్దం చేసే అవకాశం ఉంది. దీనికి వ్యతిరేకంగా కథోలిక చర్చి ప్రదర్శనలు చేపట్టింది.

న్యాయవాదులు మరియు కార్యకర్తలు కారుణ్య మరణాలకు వ్యతిరేకంగా పోరాటం చెయ్యడం ఎంతో సంతోషంగా ఉంది అని  సిడ్నీ అగ్రపీఠం పబ్లిక్ అఫైర్స్ డైరెక్టర్ మోనికా డౌమిట్ అన్నారు.

ఆర్చ్ బిషప్ ఆంథోనీ ఫిషర్ నేతృత్వంలో, చర్చి లాబీయింగ్ మరియు ర్యాలీల ద్వారా ఈ పని చురుకుగా జరుగుతుంది. అలాగే కథోలిక ఆసుపత్రులు మరియు వయో సంరక్షణ సౌకర్యాలను మెరుగుపరుస్తుంది. కారుణ్య మరణాలు గణనీయంగా పెరిగినందున ఈ పని అవసరంగా మారింది.

మోనికా డౌమిట్
పబ్లిక్ అఫైర్స్ డైరెక్టర్, సిడ్నీ ఆర్చ్ డియోసెస్
కారుణ్య మరణాన్ని చట్టబద్ధం చేసిన మొదటి రాష్ట్రం విక్టోరియా. వారు మొదటి సంవత్సరంలో డజను కారుణ్య మరణాలు ఉండవచ్చని అంచనా వేశారు. కానీ సుమారు 120 మంది మరణించారు.

ఈ బిల్లు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో ఆమోదాన్ని సాధించి, సెనేట్‌లో ఆమోదం పొందుతుందని అంచనా వేసినప్పటికీ, సిడ్నీ అగ్రక్పీఠం పబ్లిక్ అఫైర్స్ డైరెక్టర్ మోనికా డౌమిట్, కథోలిక సమాజం ప్రజలకు జీవితపు అంత్యదశలో  ఉత్తమ సంరక్షణను అందిస్తోందని చెప్పారు.

కథోలిక ఆసుపత్రులు మరియు కథోలిక వయోవృద్ధ సంరక్షణాలయాలలో  మనం చూసే అద్భుతమైన విషయాలలో ఒకటి ఏమిటంటే, ఎవరైనా కారుణ్య మరణాన్ని అభ్యర్థిస్తే, వారితో మాట్లాడటానికి మరియు వారి అంతర్లీన ఆందోళనలు, వారి బాధలను పరిష్కరించడానికి ప్రత్యేకంగా శిక్షణ పొందిన బృందం ఉంది. వారి భయాలు తొలగించి వారికి సంపూర్ణ సంరక్షణ ఇస్తుంది. మరియు వారు కారుణ్య మరణం కోసం చేసే అభ్యర్థనను ఉపసంహరించుకుంటున్నారు.

Add new comment

1 + 4 =