కాననైజేషన్ ప్రక్రియను సోషల్ మీడియా ప్రభావితం చేస్తుందా?

ననైజేషన్ ప్రక్రియహోలీనెస్ టుడే సమావేశం

ఒక వ్యక్తిని పునీతునిగా ప్రకటించాలా వద్దా అనే విషయాన్ని నిర్ణయించడానికి నేడు  ఇంటర్నెట్‌లో పోస్ట్ చేయబడిన ట్వీట్లు, ఫేస్‌బుక్ సందేశాలు మరియు ఫోటోలు-సోషల్ మీడియా ముఖ్య పాత్రను పోషిస్తున్నాయి. ఒకరి వ్యక్తిగత జీవితాన్ని సులభంగా పంచుకునేలా చేస్తున్నాయి. ఇవన్నీ వాటికన్ లో కూడా పరిణామాలను కలిగిస్తున్నాయి.

ఈ అంశాన్ని గూర్చి రోమ్‌లోని అగస్టినియానమ్‌లో జరిగిన "హోలీనెస్ టుడే" అనే సమావేశంలో చర్చించారు.

ఈ సమావేశానికి హాజరైన వారిలో కాంగ్రెగేషన్ ఫర్ ది కాసెస్ అఫ్ సెయింట్స్ ప్రిఫెక్ట్ అయిన కార్డినల్ మార్సెల్లో సెమెరారో కూడా ఉన్నారు.  సామాజిక మాధ్యమాన్ని కాననైజేషన్ ప్రక్రియను నిర్వీర్యం చేసే ప్రతికూలంగా చూడకూడదని, డికాస్టరీ పనిని మెరుగుపరచడంలో సహాయపడే సాధనంలా చూడాలని ఆయన అన్నారు.

ఈ రోజు మీడియా వైపు నుండి, ఈ బహుముఖ వాస్తవికతను తెలుసుకోవడంలో మనకు చాలా సహాయం లభిస్తుంది. కొన్నిసార్లు పండితులు మొత్తం ఆధునిక ప్రపంచానికి బదులుగా ఒక అంశంపై దృష్టి పెడతారు. ఈ విశాల దృశ్యాలతో, మనం చాలా కోణాలను చూడగలుగుతున్నాము అని ఆయన అభిప్రాయం పడ్డారు.

సోషల్ మీడియా పోస్ట్‌లను సందర్భానుసారంగా చదవాలని కూడా ఆయన సూచించారు.

నిశ్చయంగా ప్రజలు ఈ విషయాలపై ఇచ్చే శ్రద్ధ మరియు అవి భిన్నమైన ఆసక్తులను చూపించే సాక్ష్యాలు. కానీ, పవిత్రతను లైక్ లతో  కొలవలేమని ఆయన అన్నారు.

హోలీ సీ ప్రెస్ ఆఫీస్ మాజీ డైరెక్టర్, గురుశ్రీ ఫెడెరికో లొంబార్డి కూడా సమావేశంలో మాట్లాడారు.

సదస్సులో నిపుణులు సోషల్ మీడియాను ఎలా ఉపయోగించాలో నేర్చుకోవడం గురించి కూడా చర్చించారు. సోషల్ మీడియా ప్రజల జీవితంలో అంత ముఖ్యమైన భాగమైతే, భవిష్యత్ గురువులు ఈ సోషల్ మీడియాను ఎలా ఉపయోగించాలో నేర్చుకోవడం అవసరం అని ఆయన సూచించారు. 

ప్రతి ఒక్కరూ తన యుగంలో జీవించాలి. ఇప్పుడు సోషల్ మీడియా ప్రపంచంలో నివసిస్తున్న వారు సంభాషణను వ్యక్తీకరించడానికి మరియు పవిత్రత యొక్క విలువలను శోధించడానికి ఒక మార్గాన్ని కనుగొనాలి. మరియు ఇది, వారు స్వయంగా చేయాలి. ఇది కొత్త పరిస్థితి కాబట్టి వారికి బోధించే వారు ఎవరూ లేరు అని గురుశ్రీ ఫెడెరికో గారు అన్నారు.

మరియు రోమ్ ట్రే యూనివర్సిటీ ప్రొఫెసర్ సిసిలియా కోస్టా మాట్లాడుతూ మనలో ప్రతి ఒక్కరికి బాహ్య ప్రభావాలను అధిగమించే సామర్థ్యం, ​​సృజనాత్మకత మరియు ప్రేరణ ఉంటుంది కాబట్టి అన్ని బాహ్య కారకాలు మనల్ని నిర్బంధం చేస్తాయి కానీ మనల్ని నిర్వచించవు  అన్నారు.

పవిత్రత మరియు సోషల్ మీడియా యొక్క సవాలు భవిష్యత్తుకు సంబంధించినది కాదు, ప్రస్తుతానికి సంబంధించినది. 2006లో 15 ఏళ్ల వయసులో మరణించిన యువకుడు కార్లో అక్యూటిస్ నేటి యువతకు ఒక ఉదాహరణగా పరిగణించబడ్డాడు. వాస్తవానికి, అతను ఇంటర్నెట్ యొక్క పోషకుడిగా మారాలని చాలా మంది నమ్ముతున్నారు.

Add new comment

4 + 5 =