కలవరపెడుతున్న "డెల్టా ప్లస్‌ వేరియంట్"...

భారత్‌లో గుర్తించిన డెల్టా వేరియంట్ కొత్త రూపం దాల్చిన విషయం తెలిసిందే. ‘డెల్టా ప్లస్‌’గా జన్యుమార్పిడి చెందిన ఈ వేరియంట్ ఆత్యంత  ప్రమాదకారని అని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే డెల్టా ప్లస్ కు సంబంధించిన కేసులు  పలు రాష్ట్రాల్లో నమోదు అవుతున్నాయి .మన దేశం లో ఈ "డెల్టా ప్లస్ వేరియంట్" కారణంగా తొలి మరణం మధ్యప్రదేశ్‌లో సంభవించింది.
మన దేశం లో "డెల్టా ప్లస్ వేరియంట్"  క్రమంగా పెరుగుతుండటంతో  రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. దీని కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. మన దేశంలో మొత్తం 48కిపైగా డెల్టా ప్లస్ కేసులు నమోయ్యాయి. ఇది  ఒకరి నుంచి మరొకరికి త్వరగా వ్యాప్తి చెందుతుందని తెలుస్తుంది .దేశంలో కరోనా బాధితుల సంఖ్య గడిచిన రెండు రోజుల నుంచి రోజువారీ కేసులు 50వేలకుపైగా నమోదవుతున్నాయి.  ప్రజలు నిర్లక్ష్యంగా ఉంటే  థర్డ్‌ వేవ్‌ వచ్చే ప్రమాదముందని వైద్యులు ఆందోళన చెందుతున్నారు.

Add new comment

2 + 8 =