కలకత్తా అతిమేత్రాసనం కాథోలికులు కుటుంబాలను దేవుని ప్రతిబింబాలు గా ఉండమని కోరింది

పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, కలకత్తా అతిమేత్రాసనం, "అమోరిస్ లాటిటియా" (ప్రేమ యొక్క ఆనందం) కుటుంబ సంవత్సర ముగింపును జూన్ 26న ప్యాట్రిక్ దేవాలయం జరుపుకుంది, ఇది స్థాపించబడి 200 సంవత్సరాలు పూర్తవుతోంది.
“ప్రతి కుటుంబం త్రికరణశుద్ధిగా ఉన్న దేవుని ఐక్యతను ప్రతిబింబిస్తుంది మరియు ప్రేమ, శాంతి మరియు ఆనందానికి సాధనంగా మారాలి. అని అగ్రపీఠాధిపతులు థామస్ డిసౌజా గారు తెలిపారు.
"వివాహం: పవిత్రతకు ఒక వృత్తి" అనే అంశంపై మాట్లాడుతూ, పశ్చిమ బెంగాల్ మరియు సిక్కిం ప్రాంతానికి చెందిన ప్రాంతీయ కుటుంబ కమీషన్ మాజీ డైరెక్టర్ గురుశ్రీ ప్రొదీప్ రాయ్ గారు, పవిత్ర యూకారిస్ట్ మరియు క్రిస్టియన్ వివాహానికి మధ్య సమాంతరంగా చేశారు.
వివాహం అనేది ఒక పవిత్రమైన పిలుపు, ఇక్కడ దేవుడు కలిసి జీవితంలో ఒడిదుడుకుల ద్వారా వివాహితులకు ప్రత్యేక అనుగ్రహాన్ని గురుశ్రీ ప్రొదీప్ రాయ్ గారు తెలిపారు.
వర్క్‌షాప్ సెషన్‌లో, జంటలు భార్యాభర్తల సంతోషకరమైన క్షణాలు, ఒకరినొకరు దేవునికి మరియు ఒకరికొకరు దగ్గరయ్యే మార్గాలు, దేవుని ప్రత్యేక బహుమతులు మరియు భార్యాభర్తలుగా విభేదాలు మరియు అభిప్రాయ భేదాలను పరిష్కరించుకునే మార్గాలపై చర్చించారు.
గత 40 సంవత్సరాలుగా కమిషన్‌కు విశిష్ట సేవలందించినందుకు కుటుంబ కమీషన్ రాబర్ట్ డి'గామా గారు, మోలినా విన్సెంట్ గారు, గెరాల్డ్ మరియు గ్లోరియా డి'రోజారియోలను సత్కరిచారు.

Add new comment

6 + 3 =