కర్నూల్ మేత్రాసనం పెద్దకడుగూరు విచారణలో నిత్య సహాయమాత గృహ పండుగ

కర్నూల్ మేత్రాసనంనిత్య సహాయమాత గృహ

కర్నూల్ మేత్రాసనం, ఆదోని డీనరీ, పెద్దకడుగూరు విచారణ, పునీత పేతురుగారి దేవాలయము నందు నిత్య సహాయమాత గృహ పండుగను ఘనంగా కొనియాడారు. గురుశ్రీ అర్లప్ప గారు తాడిపత్రి విచారణ గురువులు మరియ తల్లి క్రైస్తవులకు సహాయం చేసిన విధానం గురించి వివరించి, సమిష్టి దివ్యబలిపూజను సమర్పించారు. ఏడుగురు గురువులు ఈ దివ్యపూజలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం మే నెల 24వ తేదీన నిత్య సహాయమాత గృహ పండుగను ఘనంగా కొనియాడుతారు. సహాయమాత గృహ దాదాపు 18 సంవత్సరాల క్రితం స్థాపించబడింది. ప్రతి సంవత్సరం రమారమి 2వేళ మంది మరియమాత భక్తులు ఈ పూజలో పాల్గొని మరియతల్లి యొక్క దివ్య ఆశీస్సులను పొందుకుంటారు. విచారణ గురువులు గురుశ్రీ సంజీవ్ గారు పూజాబలిని సమర్పించిన గురుశ్రీ అర్లప్ప గారికి, పూజకు విచ్చేసిన గురువులకు, విశ్వాసులకు, విచారణ ప్రజలకు, సంఘ పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Add new comment

4 + 14 =