కర్నూలు మేత్రాసనానికి నూతన గురువులు.

16 మే 2022 కర్నూలు మేత్రాసనం,పరిశుద్ద లూర్థుమాత కథెడ్రల్ లో డీకన్ ఈ.ప్రవీణ్ మరియు డీకన్ కె.సెల్వరాజ్ గార్లని హైదరాబాద్ అగ్ర పీఠాధిపతులు మహా పూజ్య. పూల అంతోని డి.డి. గారి దివ్యహస్తాల మీదుగా, కర్నూలు మేత్రాసన కార్యనిర్వాహకులైన  మోన్సగ్నోర్ ఏ. చౌరప్ప గారు, ఇతర గురువులు, మఠవాసులు విశ్వాసుల ఆధ్వర్యములో గురువులుగా అభిషేకించబడ్డారు.   

నూతన గురువులు ఈ ప్రవీణ్ గారు మరియు కె సెల్వరాజ్ గారు దేవుని సేవలో ఫలించాలని దైవ ప్రజలకు సేవ చేయాలని అమృతవాణి రేడియో వెరితాస్ ఆసియా తెలుగు విభాగం వారు కోరుకుంటున్నారు.
 

Add new comment

4 + 1 =