కర్నూలు మేత్రాసనం చాపిరేవుల విచారణ పునీత అంతోనివారి దేవాలయ రజిత జూబిలీ వేడుకలు. 

కర్నూలు మేత్రాసనం, నంద్యాల, చాపిరేవుల విచారణలో 13 జూన్ 2022 సోమవారం రోజున విచారణ యొక్క రజిత జూబిలీ వేడుకలు ఘనంగా జరిగాయి. విచారణ ప్రజలు పాత దేవాలయము నుండి నూతనంగా నిర్మించిన పునీత అంతోని వారి ముఖద్వారం వద్దకు ఊరెగింపుగా వెళ్లారు. నూతన ముఖద్వారం విజయవాడ పీఠాధిపతులు, కర్నూలు అడ్మినిస్ట్రేటర్, కపుచిన్ ప్రొవిన్సియల్ మరియు ముఖ్య అథితిగా విచ్చేసిన నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ గారు ప్రారంభించారు. 

మొట్టమొదటి విచారణ గురువులు కీ.శ.గురుశ్రీ. అడాల్ఫ్ కన్నడిపరా గారికి  నివాళులర్పించారు.

విజయవాడ పీఠాధిపతులు మహా పూజ్య తెలగతోటి జోసఫ్ రాజారావు తండ్రిగారు, కర్నూలు మేత్రాసన అడ్మినిస్ట్రేటర్ మోన్సిగ్నోర్ అంతోనప్ప చౌరప్ప గారు, కపుచిన్ ప్రొవిన్సియల్ గురుశ్రీ .కాసు కరుణాకర్ గారు, సుమారు 50 మంది కపుచిన్ మరియు మేత్రాసన గురువులతో కలిసి సమిష్టి దివ్య బలిపూజను సమర్పించారు. 

విజయవాడ పీఠాధిపతులు దైవవాక్కును బోధిస్తూ "అంతోని వారు జీవిత చరిత్రను, ఆధ్యాత్మికంగా  వారు ఎలా ఉన్నారో, వారి ప్రార్థనా సహాయము ద్వారా మనకు జరిగిన మేలులను ఎప్పటికి మరువకూడదు అని విశ్వాసులకు బోధించారు. 

25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో కర్నూలు మేత్రాసన అడ్మినిస్ట్రేటర్ మోన్సిగ్నోర్ అంతోనప్ప చౌరప్ప గారి చేతులమీదుగా సోవినియర్ను విజయవాడ మేత్రానులకు అందచేశారు.

పునీత అంతోని వారి ప్రార్థనా పుస్తకాన్ని కపుచిన్ ప్రొవిన్సియల్ గురుశ్రీ .కాసు కరుణాకర్ గారు విడుదల చేశారు.

అమృతవర్షిణి అను పాటల సీడీని విజయవాడ పీఠాధిపతులు మహా పూజ్య తెలగతోటి జోసఫ్ రాజారావు తండ్రిగారు విడుదల చేశారు.
చాపిరేవుల గాయక బృందం పవిత్ర గీతాలను ఆలపించారు. జూబిలీ వేడుకలకు సుమారు 3000-4000 మంది విశ్వాసులు హాజరయ్యారు. 

విచారణ గురువులు గురుశ్రీ బోయపాటి ప్రవీణ్ కుమార్ జూబిలీకి  విచ్చేసిన మేత్రానులకు, గురువులకు, మఠవాసులకు, విశ్వాసులకు, విచారణ విశ్వాసులకు, సంఘపెద్దలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Add new comment

1 + 0 =