కర్నూలు మేత్రాసనంలో 40 మంది చిన్నారుల ప్రధమ దివ్య సత్ప్రసాద స్వీకరణ

కర్నూలు మేత్రాసనం తాడిపత్రి విచారణలో 40 మంది చిన్నారి బిడ్డలు క్రీస్తు ప్రభుని పరమపవిత్ర శరీరరక్తాల పండుగ సందర్భంగా 40 మంది చిన్నారులు నూతనంగా ప్రధమ దివ్య సత్ప్రసాదమును స్వీకరించారు. గురుశ్రీ పగిడాల చిన్నప్పరెడ్డి గారు ప్రధానార్చకులుగా దివ్యబలిపూజను సమర్పించి క్రీస్తు ప్రభుని పరమపవిత్ర శరీరరక్తాల విలువను ప్రజలకు తెలియజేస్తూ మరీ ముఖ్యంగా నూతనంగా దివ్య సత్ప్రసాదమును స్వీకరిస్తున్న చిన్నారులకు క్రీస్తుప్రభుని యొక్క ఆత్మీయభోజనం గురించి తెలియజేసి, ఆత్మీయ ప్రభుభోజనం స్వీకరించడం వల్ల నిత్య రక్షణ, దేవునితో సహవాసము, ఆత్మీయ శక్తి, బలం లభిస్తుందని చిన్నారులకు తెలియపరిచారు. విచారణ కర్తలు గురుశ్రీ డేవిడ్ అరుళప్ప సహాయక గురువులు గురుశ్రీ కొంక జోజిరెడ్డి గారు దివ్యబలిపూజకు తరలివచ్చిన గురుశ్రీ పగిడాల చిన్నప్పరెడ్డి గారిని, విచారణ విశ్వాసుల తరుపున, మఠవాసుల తరుపున ,సత్కరించి, అభినందనలు, ధన్యవాదాలు తెలియజేశారు. దివ్యసత్ప్రసాదాన్ని స్వీకరించిన చిన్నారులంతా గురువులతోకలిసి ఫాథర్స్ డే రోజును ఘనంగా కొనియాడారు. నూతన దివ్యసత్ప్రసాదాన్ని ఇచ్చిన గురువులకు, వారిని సిద్ధపాటు చేసిన నిర్మల సిస్టర్స్ కు, విచారణ పెద్దలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు. 

Add new comment

5 + 15 =