కర్నూలు మేత్రాసనంలో యవ్వనస్థుల వడకం ముగిసింది 

కర్నూలు మేత్రాసనంలో యవ్వనస్థుల వడకం ముగిసింది 

 

కర్నూలు మేత్రాసనం ప్రేమగిరి విచారణలోని సీనాయి డివైన్ ధ్యానాశ్రమం నందు 29 జూన్ 2022 బుధవారం రోజున యవ్వనస్థుల కొరకు నిర్వహించిన మూడు రోజుల వడకాలలో ఆఖరి రోజు వడకం ముగిసింది. 

మూడు రోజుల వడకాలలో స్తుతి ప్రార్ధనలు, దైవవాక్యపరిచర్య, దివ్యసత్ప్రసాద ఆరాధన, ఆత్మాభిషేక ఆరాధన, దివ్యబలి పూజ, యూత్ కౌన్సిలింగ్, ప్రభుని గీతాలు మొదలగు కార్యక్రమాలతో యువతను ప్రభువైపు నడిపించారు. 

29 జూన్ బుధవారం రోజున గురుశ్రీ జోజో,VC గారు దివ్యపూజాబలిని సమర్పించారు. గురుశ్రీ అజిష్,VC గారు స్వస్థత అభిషేక ఆరాధనను యువత కొరకు చేశారు. చివరగా కర్నూలు మేత్రాసన యువత డైరెక్టర్ గురుశ్రీ ఈరి బాలరాజు,VC గారు తన ప్రేరణ పలుకులతో, ఆశీర్వాదాలతో యవ్వనస్థుల వడకాన్ని ముగింపజేశారు.  దాదాపు 160 మంది యవ్వనస్థులు వడకంలో పాల్గొని దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నారు.

Add new comment

9 + 10 =