కర్నూలు మేత్రాసనంలో యవ్వనస్థుల కొరకు మూడు రోజుల వడకాలు

కర్నూలు మేత్రాసనం నందికొట్కూరు విచారణ ప్రేమగిరిలోని సీనాయి డివైన్ ధ్యానాశ్రమం నందు జూన్ 26,2022 ఆదివారం నుండి జూన్ 29,2022 బుధవారం వరకు యవ్వనస్థుల కొరకు మూడు రోజుల వడకాలను నిర్వహించారు.  
మూడు రోజుల వడకాలలో స్తుతి ప్రార్ధనలు, దైవ వాక్య పరిచర్య, దివ్యసత్ప్రసాద ఆరాధన, ఆత్మాభిషేక ఆరాధన, దివ్యబలి పూజ, యూత్ కౌన్సిలింగ్, ప్రభుని గీతాలు మొదలగు కార్యక్రమాలు జరగనున్నాయి.
వడకాలలో మొదటి రోజున కర్నూలు మేత్రాసన యువతా డైరెక్టర్ గురుశ్రీ బాలరాజు గారు జ్యోతిప్రజ్వళనతో వడకాలను ప్రారంభించారు.
మొదటి రోజు వడకంలో భాగంగా గురుశ్రీ జైసన్ V.C.గారు ముఖ్య ప్రసంగీకులుగా తన ప్రసంగంతో యువతను ఉత్తేజపరిచే విధంగా ప్రసంగించారు.  యువతను దేవుని ప్రేమలో జీవించేలాగున ప్రేరేపించారు.
వడకంలో సీనాయి డివైన్ ధ్యానాశ్రమ అధ్యక్షులు గురుశ్రీ అజీశ్V.C. గారు, ఉపాధ్యక్షులు గురుశ్రీ సతీష్V.C. గారు, గురుశ్రీ జోజి V.C. గారు మరియు జీసస్ యూత్ నుంచి బ్రదర్ యేసు బాబు గార్లు మొదటిరోజు వాడకంలో పాల్గొన్నారు. 

 

Add new comment

1 + 0 =