కర్నూలు మేత్రాసనంలో నూతన దేవాలయ ప్రారంభోత్సవం

కర్నూలు మేత్రాసనం కల్లూరులో ఆరోగ్యమాత పుణ్యక్షేత్ర నూతన విచారణ దేవాలయ ప్రారంభ మహోత్సవం జూన్ 30 2022 గురువారం రోజున ఘనంగా జరిగింది. ఉ-8:00గంllలకు తలనీలాల సమర్పణ, మధ్యాహ్నం 2 :00 గంllలకు కల్లూరు పురవీధుల్లో ఆరోగ్యమాత తేరు ఊరేగింపు, సాయంత్రం 5:00 గంటలకు ఆరోగ్యమాత పుణ్యక్షేత్రం- నూతన విచారణ దేవాలయ ప్రతిష్ఠోత్సవాన్ని కర్నూలు మేత్రాసన పాలనాధికారి మొంసిగ్నోర్ అంథొనప్ప చౌరప్ప గారి చేతులు మీదుగా దివ్యపూజాబలిని సమర్పించారు. ఈ నూతన దేవాలయ మహోత్సవాన్ని దాదాపుగా 50 మంది గురువులు, మఠవాసులు, 3000 మంది విశ్వాసులు హాజరయ్యారు. విచారణ కర్తలు గురుశ్రీ పసల లాహాస్త్రాయ గారు మహోత్సవానికి విచ్చేసిన  పాలనాధికారి చౌరప్ప గారికి, గురువులకు, మఠవాసులకు, విశ్వాసులకు, సంఘపెద్దలకు, దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు.

Add new comment

4 + 11 =