కరోనా సమయంలో ప్రేమను చూపుతున్న ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సోషల్ ఫోరమ్

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సోషల్ ఫోరమ్ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సోషల్ ఫోరమ్

కరోనా సమయంలో ప్రేమను చూపుతున్న ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సోషల్ ఫోరమ్

6 జూన్ 2021 , మూడ్ఫోర్ట్ విచారణ: స్థానిక మూడ్ఫోర్ట్ విచారణలోని పునీత అంథోని వారి చర్చి నందు నేడు 200 మందికి ఆహార పొట్లాలు పంచడం జరిగింది. కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న ఈ సమయంలో ఎందరో చేసుకోవడానికి పని లేక పని లేని కారణంగా సంపాదన లేక, సంపాదన లేని కారణంగా తినడానికి ఆహరం లేక ఘోర స్థితిలో ఎన్నో బాధలు పడుతున్నారు. అటువంటి వారికి ఒక్క పూట ఆహరం ఇచ్చినా ఎంతో పుణ్యం దక్కుతుంది. సరిగ్గా ఇదే పని చేసారు  ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సోషల్ ఫోరమ్ వారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సోషల్ ఫోరమ్ అధ్యక్షులు హైదరాబాద్ అగ్రపీఠాధిపతి అయిన మహా ఘన పూల అంథోని గారు ప్రోద్బలంతో డైరెక్టర్ ఫాదర్ కనపాల కిరణ్ కుమార్ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. 

సుమారు 200 కు పైగా పేద వారికి ఆహార పొట్లాలు పంచారు. ఈ కార్యక్రమం ద్వారా క్రీస్తు ప్రేమను క్రియల రూపంలో చూపడమే కాక ఎంతోమందికి ఒక మంచి సుమాతృక చూపుతున్న ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సోషల్ ఫోరమ్ వారికి అమృతవాణి మరియు రేడియో వెరితాస్ ఆసియ తెలుగు వారి అభినందనలు. 

 

Article by

Arvind Bandi

Online Producer

Add new comment

7 + 8 =