కరోనా సమయంలో కరుణ కలిగి ఉండాలని తన చేతల ద్వారా తెలుపుతున్న అగ్రపీఠాధిపతి

అగ్రపీఠాధిపతి మహా ఘన పూల అంథోని

కరోనా సమయంలో కరుణ కలిగి ఉండాలని తన చేతల ద్వారా తెలుపుతున్న అగ్రపీఠాధిపతి 

కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న ఈ సమయంలో బయటకు రావడానికే ప్రజలు భయపడుతున్నారు. ఇటువంటి సమయంలో తినడానికి ఆహరం కూడా లేని వారికి నిత్యావసర వస్తువులు పంచిపెడుతూ క్రీస్తుని కరుణను చాటుతున్నారు హైదరాబాద్ అగ్రపీఠాధిపతి అయిన మహా ఘన పూల అంథోని గారు. శుక్రవారం ఉదయం సెయింట్ మేరీస్ బాసిలికా నందు జరిగిన కార్యక్రమంలో ఆయన అనేక మంది పేదలకు నిత్యావసర వస్తువులు పంచి పెట్టారు.

ఈ సహాయం ఎంతో ఉపయుక్తంగా ఉందని అక్కడికి వచ్చి సహాయం పొందిన అనేక మంది అన్నారు. ఆపద సమయాలలో చిన్న సహాయమైన ఎంత విలువైనదో ఈ కార్యక్రమం ద్వారా తెలుస్తుందని. సహాయం చెయ్య గలిగిన స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని ఈ సందర్భంగా అంథోని తండ్రి గారు యావత్ కథోలిక సంఘానికి పిలుపునిచ్చారు.

Article by

Arvind Bandi

Online Producer

Add new comment

18 + 1 =