కరోనా రోగుల కోసం వంద పడకల ఆరోగ్య కేంద్రంగా మారిన కథోలిక పాఠశాల

St Josephs schoolసెయింట్ జోసెఫ్స్ బ్రియాన్డ్  స్క్వేర్ పాఠశాల

కరోనా రోగుల కోసం వంద పడకల ఆరోగ్య కేంద్రంగా మారిన కథోలిక పాఠశాల 

బెంగళూరు అగ్ర పీఠాధిపతులు మహా ఘన డాక్టర్ పీటర్ మాచదో గారి నేతృత్వంలో పునీత మార్త ఆసుపత్రి వారి సహకారంతో బెంగళూరు అగ్ర పీఠం పరిధిలో సెయింట్ జోసెఫ్స్ బ్రియాన్డ్  స్క్వేర్ పాఠశాల నందు కరోనా రోగుల కోసం వంద పడకల ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. 

ఇక్కడ కరోనా రోగులకు తగిన వైద్య సదుపాయాలు లభిస్తాయని ఆక్సిజన్, ప్రాధమిక వైద్యం, పడకల సదుపాయం, వంటి వసతులు ఇక్కడ లభిస్తాయని ఈ సందర్భంగా తెలియజేసారు. బెంగళూరు పరిధిలో ఇటువంటి ఆరోగ్య కేంద్రాలను మరిన్ని ప్రారంభించనున్నట్లు మహా ఘన డాక్టర్ పీటర్ మాచదో ఒక ప్రకటనలో తెలియజేసారు.

Add new comment

7 + 0 =