కరోనా బాధితుల వసతి గృహానికి 50 పడకలు ఇచ్చిన కొత్త జంట.

Love your neighbor as yourself
నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెను మత్తయి 22:39

కరోనా బాధితుల వసతి గృహానికి 50 పడకలు ఇచ్చిన కొత్త జంట.

ముంబై వద్ద వసై లోని ఒక జంట తమ వివాహ సందర్భంగా ఆసుపత్రికి 50 పడకలు ఇచ్చారు. ప్రత్యేకంగా కరోనా వ్యాధిగ్రస్తులకు ఏర్పాటు చెయ్యబడిన ఆసుపత్రికి 50 పడకలు, ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చారు.

ముంబై లో నివసిస్తున్న  ఎరిక్ లోబో మరియు మెర్లిన్ టాస్కేనో గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు.ఈ సంవత్సరం మొదటిలో పెళ్లి ద్వారా ఒకటవ్వాలని వారు నిర్ణయించుకున్నారు. రెండు వేల మంది అతిధులను వారి పెళ్లికి ఆహ్వానించాలని కూడా అనుకున్నారు. కానీ ఇంతలో కరోనా మహమ్మారి భారత దేశంపై విరుచుకు పడడం, అందునా మహారాష్ట్ర రాష్ట్రంలో అత్యధికంగా ఇది వ్యాపించడం, రవాణా వ్యవస్థ స్థంబించిపోవడం, దేశం అంతా లాక్ డౌన్ లోనికి వెళ్లడం ఇత్యాది పరిణామాల నేపథ్యంలో వీరు తమ వివాహాన్ని వాయిదా వేసుకున్నారు.

స్వతహాగా సున్నిత మనస్కులైన వీరిద్దరూ, కరోనా వల్ల అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్న దీనులను చూసి చాలించి పోయారు. వలస కూలీలకు తమ స్వంత ధనం తో సహాయం చెయ్యడం, వారికి రైలు టికెట్లను కొని ఇవ్వడం, రోజువారీ కూలీలకు వంటలు వండి ఆహరం ఇవ్వడం వంటి ఎన్నో సహాయక చర్యలలో వీరిద్దరి కలిసి చురుకుగా పాల్గొన్నారు. 

జూన్ 20 న వీరు వేసాయి లోని పునీత గొంసాలో  గర్ సియా చర్చి నందు వివాహ బంధంలో ఏకమైయ్యారు. వీరి వివాహానికి వీరి కుటుంబ సభ్యులతో కలిపి మొత్తం 22 మంది అతిధులు మాత్రమే హాజరు అయ్యారు. వివాహానంతరం వీరు నేరుగా కరోనా వ్యాధిగ్రస్తులను విడిగా ఉంచిన సత్పల అనే వసతి గృహానికి వెళ్లి వారికి 50 పడకలు, పరుపులు, దిండ్లను మరియు ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చారు.

వీరు తమ వివాహానికి అయ్యే ఖర్చును తగ్గించి, ఆ మొత్తాన్ని ఇటువంటి మంచి పనికి ఉపయోగించినందుకు చాల సంతోషంగా ఉందని ఈ కొత్త జంట అన్నారు. సామాజిక సహాయ కార్యక్రమాలలో నిత్యం ఉండే వీరికి  ఈ ఆలోచన సహజంగానే వచ్చిందని అన్నారు. వీరు మొరొక్క అడుగు ముందుకు వేస్తూ, తమ హనీమూన్ కూడా రద్దు చేసుకున్నట్లు, ఆ ధనాన్ని కూడా కరోనా బారిన పడిన వారికోసం ఉపయోగించనున్నట్లు వారు తెలిపారు.

ఇప్పటివరకు మహారాష్ట్రలో 1 , 35 , 796 కరోనా కేసులు నమోదు కాగా వారిలో 6 , 283 మంది కోలుకున్నారు. ఇంకా 61 , 807 మంది ఈ వ్యాధి చేత ఇంకా బాధ పడుతూ ఆసుపత్రులలో  ఉన్నారు.  

 

News source: https://www.rvasia.org/newly-wed-couple-donates-50-beds-covid-19-care-centre

Add new comment

4 + 10 =