కరోనా తో 13 మంది సిస్టర్స్ కన్నుమూత

sisters

అమెరికా లో కరోనా విలయ తాండవం చేస్తుంది. మిచిగాన్ లోని ఫెలీషియన్ సిస్టర్స్ కన్వెంట్ లో కరోనా తో  13మంది సిస్టర్స్(nuns) ను పొట్టన పెట్టుకుంది. ఒకే కాన్వెంట్  లో  నెల రోజుల వ్యవధిలో 12మంది సిస్టర్లు  కన్నుమూశారు. మొదటిగా గుడ్ ఫ్రైడే రోజున సిస్టర్ మేరీ లూయిజా వావర్జినియాక్ కరోనాతో కన్నుమూశారు. ఆమె వయసు 99 ఏళ్లు. మరో 17మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొవిడ్ నుంచి కోలుకున్నప్పటికీ ఓ సిస్టర్ జూన్ నెలలో కన్నుమూసినట్టు అవర్ లేడీ ఆఫ్ హోప్ ప్రావిన్స్ క్లినికల్ హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ సీనియర్ నోయెల్ మేరీ గాబ్రియేల్ తెలిపారు.

పెద్ద వయసు గల సిస్టర్స్ అందరు రిటైర్మెంట్ కు ముందు  స్కూల్ టీచర్లుగా, ప్రొఫెసర్లుగా, ప్రిన్సిపాల్స్ గా పని చేశారు.
కరోనాతో 13 మంది నన్స్ మరణించడాన్నిఅక్కడ ప్రజలు మరియు మిగతా సిస్టర్స్  జీర్ణించుకోలేకపోతున్నారు.చర్చి వారి  మరణం తీరని లోటుగా తెలిపింది.  కరోనా దెబ్బతో ప్రపంచవ్యాప్తంగా  సుమారు 60 మంది ఫెలీషియన్ సిస్టర్స్ చనిపోయి ఉంటారని అంచనా.  విస్కాన్ సిన్ లో లేడీ ఆఫ్ ఏంజిల్స్ కాన్వెంట్ లో ఆరు మంది సిస్టర్లు కొవిడ్ కారణంగా మృత్యువాతపడ్డారు.

కరోనా తీవ్రత పెరగడంతో  కరోనా కట్టడికి కఠిన నిబంధనలు అమలు చేశారు. అయినప్పట్టకి కరోనా వైరస్ కాన్వెంట్ ని చేరింది. చాలా వేగంగా వ్యాపించింది.ప్రతి రోజు అందరికోసం ప్రార్థనలు చేసే సిస్టర్స్  ,ఒక నెల లోనే 12 మంది చనిపోవడం ఆందోళనకు గురి చేసింది .వారి ఆత్మకు శాంతి కలగాలని ,ప్రజలకు సేవ చేసే వారందరిని మరియు ప్రజలనాదరిని ఈ కరోనా బారినుండి కాపాడమని ఆ దేవాది దేవుని ప్రార్దించుదాము .

Add new comment

19 + 1 =