కడప మేత్రాసనం, రామాంజినేయపురం, యేసు తిరుహృదయ సువార్త కేంద్రములో సినడ్ సభ.

కడప మేత్రాసనం, రామాంజినేయపురం, యేసు తిరుహృదయ సువార్త కేంద్రము నందు డీనరీ స్థాయి సినడ్ సమావేశం మే 30, 2022న జరిగింది. 

కడప డీనరీ నుండి 34 మంది గురువులు, 42 మంది మఠవాసులు మరియు సుమారు 102 గృహస్థ క్రైస్తవ విశ్వాసులు నాలుగు వందలమంది పాల్గొన్నారు.

ఈ సమావేశం ఉదయం 10 గంటలకు కడప మేత్రాసన ఛాన్సలర్ గురుశ్రీ సాగినాల పాల్ ప్రకాష్, మేత్రాసన DGM గురుశ్రీ ఈరీ మరియన్నగారు, గురుశ్రీ జాన్సన్ చిట్టూర్ గారు,గురుశ్రీ పీ.అబ్రహం, అమృతవాణి డైరెక్టర్ గురుశ్రీ పప్పుల సుధాకర్ గార్లచే జ్యోతిప్రజ్వలనతో ప్రారంభమైంది. 

గురుశ్రీ పీ.అబ్రహం గారు విచ్చేసిన గురువులు,మఠవాసులు,భాగస్వామ్యులందరికి ఆహ్వానం పలికారు.

వాఖ్యతలుగా  విచ్చేసిన అమృతవాణి డైరెక్టర్ గురుశ్రీ పప్పుల సుధాకర్ గారు సినడ్ వాటి ముఖ్య ఉదేశాల గురించి అర్థవంతంగా బోధించారు

కార్యక్రమానికి విచ్చేసిన గురువులను, కన్యస్త్రీలను మరియు విశ్వాసులను మధ్యాహ్నం బృంద చర్చలు నిర్వహించి వారి అభిప్రాయాలను సభ్యులముందు వ్యక్తపరిచారు 

మేత్రాసన ఛాన్సలర్ గురుశ్రీ సాగినాల పాల్ ప్రకాష్ గారు సినడ్ గురించి మాట్లాడారు, కడప మేత్రాసన అపోస్టోలిక్ అడ్మినిస్ట్రేటర్ మహా పూజ్య Gగాలి బాలి తండ్రి గారి తరపున అమృతవాణి డైరెక్టర్ గురుశ్రీ పప్పుల సుధాకర్ గారిని అభినందించారు. 

కడప మేత్రాసన డీన్ గురుశ్రీ పీ.అబ్రహం గారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన గురువులకు, కన్యస్త్రీలకు మరియు విశ్వాసులకు వందనాలు తెలియచేస్తూ శ్రీసభ అభివృధిలో ప్రతిఒక్కరు భాగస్తులు కావాలని కోరారు

ఇటువంటి కార్యక్రమాలు చేసి విశ్వాసులలో జ్ఞానాన్ని, శ్రీసభ నూత్నీకరణ, దైవరాజ్య స్థాపనకై  కృషిచేసిన గురుశ్రీ పీ.అబ్రహం గారిని అభినందిస్తూ మరెన్నో ఇల్లాంటి కార్యక్రమాలను చేయాలని అమృతవాణి రేడియో వెరితాస్ ఆసియ తెలుగు విభాగం వారు కోరుకుంటున్నాము.

Add new comment

2 + 0 =