కడప మేత్రాసనం, పునీత పదువాపురి అంతోని వారి నూతన మంటప ప్రతిష్ఠ

2 జూన్ 2022 న, కడప మేత్రాసనం, కమలాపురం, కె.కొత్తపల్లె, పవిత్రాత్మ దేవాలయము నందు పునీత పదువాపురి అంతోని వారి నూతన మంటప ప్రతిష్ఠోత్సవం జరిగింది. 

వరంగల్ మేత్రానులు మహా పూజ్య ఉడమల బాల తండ్రిగారు  నూతన మంటపమును ఆశీర్వదించి దివ్యబలిపూజను అర్పించారు.

కడప మేత్రాసన గురువులు, మఠకన్యలు, గ్రామా ప్రజలు ఈ దివ్యబలిపూజలో పాల్గొన్నారు.

ఈ ప్రతిష్ఠకు విచ్చేసిన ప్రియతమ మేత్రానులుకు, గురువులకు, మఠవాసులకు మరియు విచారణ విశ్వాసులకు ఆ విచారణ గురువైన గురుశ్రీ  మర్రెడ్డి గారు ధన్యవాదాలు తెలియజేశారు.

కడప మేత్రాసనం విశ్వాసపధంలో ముందుకు సాగాలని, పీఠాధిపతులను, గురువులను, ఉపదేశులను మరియు విశ్వాసులను దేవుడు దీవించి ఆశీర్వదించాలని అమృతవాణి మరియు రేడియో వెరితాస్ ఆసియ తెలుగు విభాగం వారు దేవుని ప్రార్థిస్తున్నారు. 

Add new comment

7 + 10 =