Radio Veritas Asia Buick St., Fairview Park, Queszon City, Metro Manila. 1106 Philippines | + 632 9390011-15 | +6329390011-15
ఒమిక్రాన్
ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ఇప్పటికే భారత్ ను కూడా వెంటాడుతోంది. ఇఫ్పటికే దేశంలో 20కి పైగా కేసులు నమోదు అయ్యాయి.దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతోండటం పట్ల సర్వత్రా ఆందోళనలు వ్యక్తమౌతోన్నాయి. ఈ వేరియంట్ 45కిపైగా దేశాలకు వ్యాప్తిచెందింది.
కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వల్ల భారత్ లో కొవిడ్ మూడో వేవ్ తప్పదని సైంటిస్టులు హెచ్చరించారు. రాజస్థాన్‌లో ఒకే కుటుంబంలోని 9 మంది ఒమిక్రాన్ బారిన పడ్డ విషయం మనకు తెలిసినదే. ఆదివారం ఒక్క రోజే 17 ఒమిక్రాన్ వేరియంట్ కొవిడ్ కేసులు మన దేశం లో నమోదయ్యాయి.
ఈ వేరియెంట్ పిల్లలపైనే ఎక్కువగా ప్రభావం చూపుతోందని దక్షిణాఫ్రికాకు చెందిన వైద్య నిపుణులు చెబుతున్నారు. ఐతే వారిలో స్వల్ప, మధ్యస్థ స్థాయి లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని తెలిపారు.
మరోవైపు ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతున్నా. డెల్టాతో పోల్చుకుంటే అంత ప్రమాదకరమేమీ కాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Add new comment