ఒడిస్సా రైలు దుర్ఘటనలో మరణించిన వారికి సంతాపం తెలిపిన ఫ్రాన్సిస్ పాపు గారు 

ఒడిస్సా రైలు దుర్ఘటనపోప్ ఫ్రాన్సిస్

2 జూన్ 2023 న సాయంత్రం 6 : 50 ప్రాంతంలో ఒడిస్సా లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో సుమారు 288 మంది మరణించగా 900 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ఈ వార్త విన్న ఫ్రాన్సిస్ పాపు గారు ఎంతో బాధ పడ్డారని, భారత దేశ పాపు గారి రాయబారి మహా పూజ్య లియోపోల్డో జిరెల్లి గారి ద్వారా విడుదలైన ఒక ప్రకటన తెలిపింది.

ఈ దురదృష్టకర దుర్ఘటన లో తమ ప్రాణాలను కోల్పోయిన వారి ఆత్మలకు తాను ప్రార్థిస్తున్నానని, తమ ఆప్తులను కోల్పోయిన వారికి తన సంతాపాన్ని తెలుపుతున్నానని పాపు గారు తెలిపారు. ఈ దుర్ఘటనలో గాయపడ్డ వారికి సహాయం చేస్తున్న అత్యవసర సహాయక బృందం వారికి ఆ పరమతండ్రి ధైర్యాన్ని, సహనాన్ని మరియు ఓర్పును దయచెయ్యాలని పాపు గారు ప్రార్ధించారు. 
 

Add new comment

3 + 3 =