ఒడిశా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైన గిరిజన క్రైస్తవుడు

ఒడిశా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైన గిరిజన క్రైస్తవుడు  

ఒడిశా శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా జి ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన బిజెడి ఎమ్మెల్యే శ్రీ సలుగ ప్రధాన్(65) మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన్‌ను డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నుకున్నట్లు  ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు ప్రకటించారు.  

ఈ సందర్భంగా శ్రీ సలుగ ప్రధాన్ గారు మాట్లాడుతూ.. తనను డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నుకున్నందుకు అసెంబ్లీ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీని ప్రజాస్వామ్య దేవాలయంగా అభివర్ణించిన ఆయన, సభ్యులందరూ సమిష్టిగా సభ గౌరవాన్ని కాపాడుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.  
ప్రధాన్ తన అనూహ్య ఎన్నికను "రాష్ట్ర గిరిజన సమాజానికి కీర్తి క్షణం"గా అభివర్ణించారు. అతను కోండ్ గిరిజన తెగకు  ప్రాతినిధ్యం వహిస్తూ కంధమాల్‌లోని ఘుముసర్ ఉదయగిరి అసెంబ్లీ స్థానానికి శాసనసభ సభ్యునిగా (MLA)గా  రెండు ఎన్నికల్లో గెలిచారు.

2008 ఒడిశా రాష్ట్రంలోని ఉదయగిరి నియోజకవర్గంలో కంధమాల్ జిల్లాలో జరిగీన అత్యంత దారుణమైన  హింసలో 100 మందికి పైగా క్రైస్తవుల ప్రాణాలను వదిలారు .
చట్టవిరుద్ధమైన మావోయిస్టులు ఆగస్టు 2008లో హిందూ స్వామి లక్ష్మణానంద సరస్వతిని హత్య చేశారు, ఫలితంగా కంధమాల్ జిల్లాలో క్రైస్తవ వ్యతిరేక అల్లర్లు  జరిగాయి.హత్య వెనుక "క్రైస్తవ కుట్ర" ఉందని హిందూ సంఘాలు ఆరోపించాయి, ఫలితంగా 300 క్రైస్తవ దేవాలయాలు  దెబ్బతిన్నాయి మరియు 56,000 మంది ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు.15 ఏళ్లు గడిచినా, 518 రిఫర్ చేసిన కేసుల్లో అనేక కేసులను కోర్టు పరిష్కరించలేదు. సలుగ ప్రధాన్ గారు ఇదే ప్రాంతంనుండి అసెంబ్లీ స్థానానికి శాసనసభ సభ్యునిగా  రెండు సార్లు ఎన్నికయ్యారు.

కటక్-భువనేశ్వర్ ఆర్చ్ డియోసెస్  ఫాదర్ దిబాకర్ పరిచా "ఒక గిరిజన క్రైస్తవుడిని ఉన్నత పదవిలో నియమించినందుకు" రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
అయన  మాట్లాడుతూ ఆదివాసి క్రైస్తవులకు ఏమేరకు సహాయం చేస్తారో చూడాలన్నారు   ఎందుకంటే  రాజకీయ నాయకుడిగా, అతను తన పార్టీ వైఖరికి కట్టుబడి ఉండాలి" అని పరిచా UCA న్యూస్‌తో అన్నారు.

ఒడిషాలో 62 కంటే ఎక్కువ గిరిజన సమూహాలు నివసిస్తున్నాయి, 41 మిలియన్ల జనాభాలో దాదాపు 23 శాతం మంది ఉన్నారు మరియు 21 గిరిజన భాషలు మాట్లాడుతున్నారు.

 

Add new comment

1 + 0 =