Radio Veritas Asia Buick St., Fairview Park, Queszon City, Metro Manila. 1106 Philippines | + 632 9390011-15 | +6329390011-15
ఐక్యత మరియు సంఘీ భావం కోసం మొక్కలను నాటిన కంబోడియా కథోలికులు
జూలై 24న, మోండోల్ కిరీ ప్రావిన్స్‌లోని కియో సీమా జిల్లాలో కథోలికులు తమ విచారణ భూమిలో 150 కలప మొక్కలను నాటారు. గురుశ్రీ బోరే ఫాన్ గారు మాట్లాడుతూ, "చెట్లు నాటడం విచారణ కమిటీ ఐక్యత కోసం మరియు వారి మధ్య ఉండే సంఘీభావం, సమాజంలో ఉన్నతమైన కార్యాలకు దారితీస్తుంది" అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమం కియో సీమాలోని కథోలిక ప్రజల ఆలోచన మరియు భావి తరాల వారు మొక్కల అభివృద్ధి ఎలా ఉంటుందో తెలుసుకోగలగాలి అనే లక్ష్యంతో మొక్కలను నాటుతున్నాము అని ఆయన అన్నారు. వీరు 150 క్రాన్‌హాంగ్, బెంగ్ (మఖా చెట్టు) మరియు నీంగ్ నూన్ (రోజ్‌వుడ్) మొక్కలను నాటారు. కంబోడియాలో ఈ జాతుల చెట్ల సంఖ్యా అంతరించిపోతున్న కారణంగా ఆ మొక్కల సంఖ్యను అభివృద్ధి చేయటమే మా ఈ చిన్న ప్రయత్నం అని ఆయన వివరించారు.
"చెట్లు నాటడం కథోలిక విశ్వాసులకు చాలా ముఖ్యం ఎందుకంటే వారు ఒక్కొక్క చెట్టును నాటినప్పుడు, వారు దేవుణ్ణి ప్రార్థిస్తారు" అందువల్ల మనం దేవుడు చేసిన సృష్టిలో భాగంగా దానిని కాపాడుకుంటూ ఆయనకు వందనాలు సమర్పించుకోగలుగుతాము అని గురుశ్రీ ఫాన్ గారు ఆర్ వి ఏ న్యూస్ తో చెప్పారు. పర్యావరణాన్ని, ప్రకృతి వనరులను పరిరక్షించాలని, భూమి భగవంతుని సృష్టి అని దానిని మనము కాపాడుకోవాలని ఆయన విచారణ ప్రజలను ప్రోత్సహించారు.
"మొక్కలకు వారి స్వంత పేర్లు ఉన్నప్పటికీ, క్రైస్తవులు వాటికి 'శాంతి చెట్టు, ఆనందం యొక్క చెట్టు, ప్రేమ చెట్టు' వంటి కొత్త పేర్లను పెట్టారు," .కియో సీమా కమ్యూనిటీలో మొక్కలు నాటే కార్యక్రమం విలాసవంతమైన అడవి, పాఠశాల భవనం,దేవాలయం మరియు విచారణ భూమిలో 3.5-హెక్టార్ల ప్లాంటేషన్ కోసం చేపట్టిన మొదటి ప్రాజెక్ట్ అని గురుశ్రీ ఫాన్ గారు తెలియజేశారు.
Add new comment