ఏలూరు మేత్రాసనం లో జాతీయ నిరసన దినం 

ఏలూరు మేత్రాసనం లో జాతీయ నిరసన దినం 
ఏలూరు మేత్రాసనం లో  లో దళిత క్రైస్తవులను ఎస్సీలలో చేర్చాలని కోరుతూ  దళిత క్రైస్తవులు నిరసన వ్యక్తం చేశారు.  ఫాదర్లు, సిస్టర్లు, సంఘ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం  వచ్చినప్పటి నుంచి దళిత క్రైస్తవులు సమాజంలో దళితులతో సమానంగా కుల వివక్షను అనుభవిస్తున్నారన్నారు. 
కానీ, ప్రభుత్వం నుంచి అందే ప్రత్యేక అవకాశాలలో అన్యాయానికి గురవుతున్నారన్నారు. ఎస్సీ రిజర్వేషన్లు అందక అవకాశాలు కోల్పోతున్నారన్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి దళిత సిక్కులు, జైనులు, బౌద్ధుల మాదిరి దళిత క్రైస్తవ, ముస్లింలను ఎస్సీలలో చేర్చి న్యాయం చేయాలని కోరారు. 

Add new comment

5 + 1 =