ఏర్పాటు కానున్న " క్రైస్తవ స్మృతి వనం"

మంత్రి కొప్పుల ఈశ్వర్క్రైస్తవ స్మృతి వనం

హైదరాబాద్ క్రైస్తవ సంఘాలు ఎప్పటి నుండో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్న కోరిక, కార్య రూపం దాల్చనుంది.

3 జూన్ 2022 న జరిగిన ఒక సమావేశంలో ఈ మేరకు ఒక ప్రకటన జరిగింది 

క్రైస్తవులకు కు సంబంధించిన శ్మశాన వాటికల (బరియల్ గ్రౌండ్ ) ఏర్పాటు కోసం నగరం చుట్టుపక్కల ప్రభుత్వం కేటాయించిన స్థలాలలో అభివృద్ధి పనులను వెంటనే చేపట్టాల్సిందిగా మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖర్ రావు గారు నగరం చుట్టుపక్కల రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలలో 10 చోట్ల కొన్ని కోట్ల రూపాయల విలువ చేసే 60ఎకరాలు కేటాయించడాన్ని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ కొప్పుల ఈశ్వర్ గుర్తు చేశారు.

ఈ శ్మశాన వాటికల ముందు " క్రైస్తవ స్మృతి వనం" అని బోర్డు పెట్టాలని అధికారులకు మంత్రి సూచించారు.వాటి చుట్టూ ప్రహారీ గోడ నిర్మించాలని, కాపలా దారులను నియమించాలని, విద్యుత్తు,నీటి సౌకర్యం కల్పించి లైట్లు బిగించాలని అధికారులను మంత్రి కొప్పుల ఆదేశించారు. క్రిస్టియన్ భవన్ నిర్మాణానికి నెలకొన్న అడ్డంకులను తొలగించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు.

ఈ సమావేశంలో మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఎ.కె.ఖాన్, ప్రభుత్వ కార్యదర్శి అహ్మద్ నదీమ్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కాంతివెస్లీ తదితరులు పాల్గొన్నారు

Add new comment

1 + 0 =