ఏపీలో వర్ష బీభత్సం

ఏపీలో వర్ష బీభత్సం

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శుక్రవారం తెల్లవారుజామున తమిళనాడులోని చెన్నై-పుదుచ్చేరి మధ్య తీరం దాటిందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి . వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. ఎక్కడిక్కడ జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లపై వరద నీరు ఉప్పొంగడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు చోట్ల వరద ప్రవాహానికి వాహనాలు కొట్టుకుని పోతున్నాయి. చిత్తూరు జిల్లా తిరుపతిలోని పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. తిరుచానూరులోని వసుంధర నగర్‌లో ఓ ఇల్లు వరదలో కొట్టుకుపోయింది. కడప నగరంలో అప్సర సర్కిల్, పాత బస్‌స్టాండ్ సహా పలు ప్రాంతాల్లో వరద నీరు ప్రవేశించింది.తిరుపతి పూర్తిగా వరద నీటిలో చిక్కుకుంది. తిరుపతి, కడప, అనంతపురం జిల్లాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావం అంతా నెల్లూరు మీద పడుతోంది.చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో సహాయక చర్యల కోసం ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి.

Add new comment

4 + 6 =