ఏపీలో మళ్లీ వర్షాలు

ఏపీని వర్షాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. గురువారం కల్లా నైరుతి బంగాళాఖాతంలో  అల్పపీడనం ఏర్పడుతుందని ఐఎండీ తెలిపింది.ఈ అల్పపీడనం మరింత బలపడి 26న తమిళనాడు, శ్రీలంక ప్రాంతాల్లోనే తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ అల్పపీడనం వల్ల​ నవంబర్ 27 నుంచి డిసెంబర్ 2 మధ్యలో అతిభారీ వర్షాలు నెల్లూరు, చిత్తూరు, కడప​, ప్రకాశం జిల్లాల్లో కురుస్తాయి. మిగిలిన అన్ని జిల్లాల్లో మోస్తరు లేదా భారీ వర్షాలు పడతాయంటున్నారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో  పలు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు సత్వరమే చేపట్టాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో మంత్రులు అధికారులతో ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.ఈ సందర్భంగా కడప జిల్లా ఇంచార్జి మంత్రి ఆదిమూలపు సురేష్ గారు మాట్లాడుతూ భారీ వరదలతో 22 మంది చనిపోయారని. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షలు ఇస్తామని తెలిపారు. అంతేకాకుండా కుటుంబంలో ఒకరిని ఉద్యోగం కూడా ఇస్తామన్నారు. మొత్తం 7,337 కుటుంబాలు నష్టపోయినట్లు గుర్తించామన్నారు. వీరికి నష్టపరిహారం అందజేశామని మంత్రి తెలిపారు.

Add new comment

2 + 3 =