ఉత్తర భారతదేశ ప్రాంతీయ బిషప్‌ల కౌన్సిల్ సమావేశం ఘనంగా జరిగింది

ఉత్తర భారతదేశ ప్రాంతీయ  బిషప్‌ల కౌన్సిల్ సమావేశం ఘనంగా జరిగింది

భారతదేశంలోని చండీగఢ్ డియోసెస్ పాస్టోరల్ సెంటర్‌లో సెప్టెంబరు 9 మరియు 10 తేదీలలో ఉత్తర భారతదేశ ప్రాంతీయ  బిషప్‌ల కౌన్సిల్ సమావేశం జరిగింది.ఈ సమావేశం  వలసదారులు మరియు శరణార్థుల ప్రపంచ దినోత్సవం అనే అంశంపై జరిగింది. ప్రతి సంవత్సరం, ప్రపంచ వలసదారులు మరియు శరణార్థుల దినోత్సవాన్ని సెప్టెంబర్ చివరి ఆదివారం నాడు జరుపుకుంటారు మరియు ఈ సంవత్సరం సెప్టెంబర్ 24 న వస్తుంది. వలసదారులను స్వాగతించడం, రక్షించడం, ప్రోత్సహించడం మరియు సమగ్రపరచడం మరియు వారిని  సమాజంలోకి తీసుకురావడం వంటి సవాళ్లు మరియు అడ్డంకుల కొరకు ఈ సమావేశం చర్చించింది.

చండీగఢ్ బిషప్ ఇగ్నేషియస్ మస్కరెన్హాస్ ఈ సమావేశాలకు అధ్యక్షత వహించారు. ఢిల్లీ ఆర్చ్ బిషప్  అనిల్  జోసెఫ్  థామస్  కౌతో గారు ,జమ్మూ మరియు శ్రీనగర్ బిషప్ ఇవాన్ పెరీరా గారు మరియు జలంధర్ డియోసెస్ అడ్మినిస్ట్రేటర్ బిషప్ ఆగ్నెలో గ్రేసియాస్ గారు ఈ సమావేశాలకు హాజరయ్యారు.ఫాదర్ జైసన్ వడస్సేరి, ఇంటర్నేషనల్ కాథలిక్ మైగ్రేషన్ కమీషన్ (ICMC) మరియు కమీషన్ ఫర్ మైగ్రెంట్స్ (కాన్ఫరెన్స్ ఆఫ్ కాథలిక్ బిషప్స్ ఆఫ్ ఇండియా),శ్రీమతి లీ మక్కీన్, లీ వే కన్సల్టెన్సీ సర్వీసెస్ న్యూఢిల్లీ ,సిస్టర్ రాణి C.J. లతో పటు ఇతర గురువులు సిస్టర్స్ ఈ సమావేశాలలో పాల్గొన్నారు.నార్త్ రీజియన్ రీజినల్ డిప్యూటీ సెక్రటరీ ఫాదర్ ఆంటోని గారు కృతజ్ఞతలు తెలుపుతూ సమావేశాన్ని ముగించారు

 

Add new comment

11 + 3 =