ఉచిత కంటి వైద్య శిబిరం | పేద ప్రజలకు అండగా విన్సెంట్ డి పాల్ సంస్థ @ తూర్పుగోదావరి జిల్లా ఏరియా కౌన్సిల్

మూలపేట సాగరమాత దేవాలయము లో సొసైటీ అఫ్ " విన్సెంట్ డి పాల్ "  తూర్పుగోదావరి జిల్లా ఏరియా కౌన్సిల్ ,ప్రెసిడెంట్ కే డేవిడ్  రాజు గారి ఆధ్వర్యములో స్థానిక సాగరమాత యూత్ కాన్ఫరెన్స్ సహకారముతో పిఠాపురం సీ.యం.సీ హాస్పిటల్  కంటి వైద్య నిపుణులు  Dr. రాబర్ట్ గారి బృందం చే ఉచిత  కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి పిఠాపురం విచారణ గురువులు ఫాదర్ అనిల్ కుమార్ (MSFS),మరియు ఫాదర్ P.అనిల్ కుమార్ గారు హాజరై ,జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు .తూర్పుగోదావరి జిల్లా ఏరియా కౌన్సిల్  ప్రెసిడెంట్ డేవిడ్ రాజు మాట్లాడుతూ "దేహానికి దీపం కన్ను "  అని  కంటి యొక్క ప్రాముఖ్యతను తెలియజేసారు .  తూర్పుగోదావరి జిల్లా ఏరియా కౌన్సిల్ సెక్రటరీ B.V.రాఘవులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సమాజ సేవ చేయాలనీ ,ప్రభు యేసు మార్గములో నడవాలని సూచించారు .
సుమారు 200మంది ప్రజలు కంటి వైద్య పరీక్షలు చేయెంచుకున్నారు.వీరిలో 25 మంది కి ఆపరేషన్ అవసరమవ్వగా Dr.తులసి గారి చే త్వరలో ఆపరేషన్ నిర్వహించబడుతుంది .
విశాఖపట్నం  సెంట్రల్  కౌన్సిల్  అధ్యక్షులు " శ్రీ రామరావు " గారు " విన్సెంట్ డి పాల్ "  ప్రెసిడెంట్ కే డేవిడ్  రాజు గారి కి మరియు మిగతా సభ్యులకు అభినందలు తెలిపారు . అవసరంలో ఉన్నవారికి ,పేద ప్రజలకు  విన్సెంట్ డి పాల్  ఎప్పుడును అండగా ఉంటుందని  మరొక్కసారి  తూర్పుగోదావరి జిల్లా ఏరియా కౌన్సిల్ నిరూపించిందని అన్నారు  .

Add new comment

4 + 1 =