ఈజిప్టు అగ్నిప్రమాదంలో 41 మంది మరణించారు.

ఈజిప్టు గిజాలోని కాప్టిక్ అబు సెఫీన్ దేవాలయంలో ఆగస్ట్ 14 ఉదయం 9 గంటల ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 41 మంది మరణించారు. వీరిలో 18 మంది 3 నుంచి 16 ఏళ్ల లోపు చిన్నారులు ఉన్నారు.

కనీసం 41 మంది మరణించారని, 14 మంది గాయపడ్డారని ఈజిప్ట్ ఆరోగ్య అధికారులు తెలిపారు. కాప్టిక్ దేవాలయ గురువులు గురుశ్రీ మౌసా ఇబ్రహీం గారు మాట్లాడుతూ, "చనిపోయిన వారిలో ఒక గురువు కూడా ఉన్నాడు అని తెలిపారు. అగ్నిప్రమాదం సంభవించినప్పుడు గిజాలోని అబు సెఫీన్ చర్చిలో ఆదివారం పూజబలి కోసం ఐదు వేల మందికి పైగా హాజరయ్యారు.ఎయిర్ కండీషనర్ యూనిట్ నుంచి ఎలక్ట్రికల్ సర్క్యూట్ షాక్ కారణంగా రెండో అంతస్తులో పెద్ద చప్పుడుతో మంటలు చెలరేగాయి.

మూడు మరియు నాల్గవ అంతస్తులో ప్రజలు రెండవ అంతస్తు నుండి పొగలు రావడం చూసారు. ప్రజలు మెట్లు దిగడానికి పరిగెత్తిన సమయంలో ఒకరిపై ఒకరు పది గాయాలపాలయ్యారు.  మంత్రిత్వ శాఖ ప్రకారం, అగ్నిప్రమాదంలో కనీసం ఇద్దరు అధికారులు మరియు ముగ్గురు సివిల్ ప్రొటెక్షన్ సర్వీస్ సభ్యులు గాయపడ్డారు.ఈజిప్టులోని 103 మిలియన్ల జనాభాలో కనీసం 10 మిలియన్లు క్రైస్తవులు ఉన్నారు.

ARTICLE BY

PAVAN KUMAR

RVA ONLINE PRODUCER

Add new comment

3 + 0 =