ఇరాక్ లో మొదటి దివ్యసత్ప్రసాదాన్ని స్వీకరించిన 172 మంది చిన్నారులు

ఇరాక్ దేశంకరాకోష్ నగరం

ఇరాక్ దేశంలోని కరాకోష్ నగరంలో 172 మంది పిల్లలు మొదటి సారి  దివ్యసత్ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ వేడుక జూన్ 3 శుక్రవారం జరిగింది. గతంలో ISIS నియంత్రణలో ఉన్న ఈ ప్రాంతం నుండి ఇటువంటి గొప్ప వేడుక జరగడం ఎంతో సంతోషదాయకం అని అక్కడి విశ్వాసులు అంటున్నారు.

ఈ వార్తను కల్దీయన్ గురువు గురుశ్రీ కరమ్ షమాషా ట్విట్టర్‌లో పంచుకున్నారు. "మా పిల్లలలో 172 మంది, 99 మంది బాలురు మరియు 73 మంది బాలికలు, బాగ్దిదా, కరాకోష్‌లో మొదటి పవిత్ర దివ్యసత్ప్రసాదాన్ని స్వీకరించారు" అని ఆయన ట్విట్టర్‌లో తెలిపారు, "కొన్ని సంవత్సరాల క్రితం క్రైస్తవులను నిర్మూలించడానికి ISIS మిలిటెంట్లు తీవ్రంగా దాడి చేసిన ప్రాంతం ఇది. ఈ రోజు బిగ్గరగా క్రైస్తవ విశ్వాసాన్ని చాటుతుంది. మా విశ్వాసం మరియు మన శిలువ గెలిచాయి." అని ఆయన వర్ణించారు.

ఆగస్టు 2014 నుండి అక్టోబర్ 2016 వరకు నగరం ISIS ఆక్రమణలో ఉంది. ఈ కాలంలో చాలా మంది క్రైస్తవులు నగరం నుండి పారిపోవలసి వచ్చింది, అయితే కొన్ని కుటుంబాలు తీవ్రవాద సంస్థ ఓటమి తరువాత తిరిగి వచ్చాయి.

గ్లోబల్ కమ్యూనిటీ సహాయంతో కరాకోష్‌లో పునర్నిర్మాణ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫ్రాన్సిస్ పాపు గారు మార్చి 2021లో మధ్యప్రాచ్య దేశానికి తన సందర్శన సందర్భంగా విశ్వాసులను కలవడానికి నగరాన్ని సందర్శించారు. 

Add new comment

8 + 7 =