ఇటాలియన్ పీఠాధిపతుల సమాఖ్యతో సమావేశమైన పోప్ ఫ్రాన్సిస్ గారు 

సోమవారం జగద్గురువులు పోప్ ఫ్రాన్సిస్ గారు  ఇటాలియన్ పీఠాధిపతుల సమాఖ్యతో సమావేశమయ్యారు. మే 22న వాటికన్ లో జరిగిన 77వ సర్వసభ్య సమావేశానికి ఇటాలియన్ బిషప్స్ కాన్ఫరెన్స్ (సీఈఐ)కి చెందిన 200 మంది పీఠాధిపతులు ఎంతో ఉత్సాహంతో ఈ సమావేశానికి హాజరయ్యారు.
సమావేశానికి అధ్యక్షత వహించిన పోప్ ఫ్రాన్సిస్ గారు  ప్రస్తుతం నడుస్తున్న సీనడ్ గురించి, పర్యావరణం, గురువిద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల గురించి పలు విషయాలు చర్చించారు. 
సమావేశ ప్రారంభంలో  ఎమిలియా-రోమాగ్నాలో తుఫాను ప్రభావిత ప్రాంతాల ఉన్న వారి కొరకు ప్రార్ధించారు.  
అనంతరం ఉత్తర, దక్షిణ, మధ్య ఇటలీలోని అన్ని ప్రాంతాల బిషప్ లతో సుమారు మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పీఠాధిపతులు అడిగిన అనేక ప్రశ్నలకు పొప్ ఎంతో ఓపికతో సమాధానం ఇచ్చారు. పేద సాధులను, వలసదారులను గుర్తించి, ఆదుకోవాలని వారికి సహాయ, సహకారాలు అందించాలని, యువతను సన్మార్గంలో నడిపించుటకు, వారిని ఆధ్యాత్మికంగా బలపరుచుటకు గురువులు నడుము బిగించాలని, శ్రీసభను మరింత అభివృద్ధి   చేయాలని పీఠాధిపతులను పొప్ ఫ్రాన్సిస్  గారు కోరారు.

Add new comment

1 + 4 =