ఇటలీ దేశాన్ని తల్లి మరియకు అర్పించనున్న కాథోలిక సంఘం

ఇటలీ దేశాన్ని తల్లి మరియకు అర్పించనున్న కాథోలిక సంఘంMother Mary

ఇటలీ దేశాన్ని తల్లి మరియకు అర్పించనున్న కాథోలిక సంఘం

శుక్రవారం , మే 1 వ తారీకున ఇటలీ  లోని పీఠాధిపతులు తమ దేశాన్ని పవిత్ర మరియ మాత రక్షణకు ఆమెకు అప్పగించనున్నారు.

ఇటలీ బిషప్పుల సమాఖ్య అధ్యక్షులగు కార్డినల్ గాళ్ టిఏరో  బస్సేట్టి  గారికి ఈ మేరకు అందిన 300  విజ్ఞాపన లేఖలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన అన్నారు.

పరిశుద్ధ మరియమాత పట్ల ప్రేమ భక్తితో నిండిన 300 లేఖలు నాకు వచ్చాయి. ఆ లేఖలు రాసిన వారు అందరు ఇటలీ దేశాన్ని ఆ నిష్కళంక హృదయురాలైన మరియమాతకు ఇంకా ఎందుకు అప్పగించలేదని ప్రశ్నించారు.

ఈ కార్యక్రమం ఇటలీ లోని బెర్గామో అనే ప్రదేశంలో ఉన్న శాంతా  మరియా  దెల  ఫాంటే అను బసిలికా లో జరుగుతుందని అయన చెప్పారు.

ముఖ్యంగా కరోనా వ్యాధి సోకి బాధపడుతున్న వారందరిని తల్లి మరియ కు అప్పగిస్తారని ఆయన అన్నారు.

ఈ మహమ్మారి వల్ల బాధ పడుతున్నవారు , వైద్యులు , ఆసుపత్రులలో పని చేస్తున్న వారు అందరు ముక్త కంఠంతో ఒకటే మాట అన్నారు , " ఇటలీ ని తల్లి మరియ హస్తాలలో అప్పగించండి అని " అని ఆయన అన్నారు.

మే మాసం ప్రత్యేకంగా మరియతల్లికి అంకితం చేసిన మాసం కావడం వలన మరియు పునీత జోజప్పగారి పండుగ మే నెల లోనే ఉండుట వలన ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన విలేఖరులకు చెప్పారు.

 

Article abstracted from: https://www.romereports.com/en/2020/04/30/italy-to-be-dedicated-to-immaculate-heart-of-mary-may-1/

Add new comment

6 + 6 =