ఇంటెన్సివ్ మీడియా శిక్షణను నిర్వహించిన CCBI

భారతీయ కథోలిక పీఠాధిపతుల సమాఖ్య  (CCBI) వారు కర్ణాటక రాష్ట్రంలో నెల రోజులపాటు మీడియా శిక్షణా కోర్సును పాలనా భవన, బెంగళూరు నిర్వహించింది.

మే 31న,  బెంగుళూరు అగ్రపీఠాధిపతుల మహా పూజ్య.పీటర్ మచాడో మరియు CCBI సెక్రటరీ జనరల్ గురుశ్రీ స్టీఫెన్ అలతారా అధ్యక్షతన జరిగిన సర్టిఫికేట్ వేడుకతో కోర్సు ముగిసింది.

భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి పన్నెండు మంది ఈ కోర్సులో పాల్గొన్నారు.

CCBI మీడియా అపోస్టోలేట్ విభాగం మరియు బెంగుళూరు అగ్రపీఠం కమ్యూనికేషన్స్ సెంటర్ సంయుక్తంగా ఈ శిక్షణను నిర్వహించాయి.

ఈ సందర్భంగా పీఠాధిపతులవారు మాట్లాడుతూ "ఈరోజు కమ్యూనికేషన్ రంగంలో మీడియా, సందేశం, మెసెంజర్ అనే మూడు ముఖ్యమైన అంశాలు" ఉన్నాయని అని తెలిపారు 

మీడియా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించిన అగ్రపీఠ కమ్యూనికేషన్ సెంటర్ డైరెక్టర్ గురుశ్రీ సిరిల్ విక్టర్ జోసఫ్‌కు మరియు రిసోర్స్ పర్సన్‌లందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Add new comment

3 + 11 =