ఆ చట్టాలు రద్దు చేసే దాకా ఇక్కడే

 
ఢిల్లీ సరిహద్దులు అయిన  సింఘూ, టిక్రీ, ఘాజీపూర్ ప్రాంతాలు ఇప్పుడు దేశ సరిహద్దులను తలపిస్తున్నాయి. దీంతో ఈ మూడు మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ మూడు ప్రాంతాల్లో పోలీసులు భారీ ఎత్తున బారికేడ్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర పభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన ప్రదర్శనలు చేస్తున్నారు. తీవ్రమైన చలి, వర్షంలో కూడా రైతులు వెనకడుగు వేయకుండా నిరసనను ( Farmer Agitation ) కొనసాగిస్తున్నారు. రైతుల నిరసన ప్రదేశాలకు వస్తున్నటువంటి ఇతర  రైతులను అడ్డుకునేందుకు కేంద్రం  మరో అడుగు ముందుకేసి అక్కడ రోడ్లపై ఏకంగా ఇనుప చువ్వలతో పాటు కాంక్రీట్ బారికేడ్లను కూడా ఏర్పాటు చేసింది. అటు రైతులు కూడా ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని చెప్తున్నారు. రిపబ్లిక్ డే రోజు రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మక ఘటనల తర్వాత నుంచి కేంద్రం వారి పట్ల మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. ఢిల్లీ సరిహద్దుల్లో నుంచి రైతులను ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తుంది. అక్కడ భారీగా పోలీసుల బలగాలను మోహరించింది. అంచెలంచెలుగా బారికేడ్లను,ఇనుప చువ్వలు,ముళ్ల కంచెలు,కాంక్రీట్ గోడలను రహదారులపై అడ్డుగా ఏర్పాటు చేసింది.
విద్యుత్, నీటి సరఫరా మరియు  ఇంటర్నెట్‌ను నిలిపివేస్తున్నారు. ఇప్పుడు బారికేడ్లు పెడుతోంది. ప్రభుత్వం చర్చలు జరపాలనుకునే ఉద్దేశం లేనట్టు ఉంది అని ఒక రైతు తెలిపారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయించుకునే మేం వెనక్కివెళ్తాం అని అక్కడ  రైతులు తెలుపుతున్నారు.

Add new comment

1 + 4 =