ఆదోని డీనరీలో గురువుల వడకం

9 జూన్ 2022 బుధవారం రోజున ఆదోని డీనరీలో, ఆదోని డీనరీ గురువులందరు డీనరీ వడకంలో పాల్గొన్నారు.  అదే రోజు స్వర్గస్తులైన గురుశ్రీ కాసుపతి   జోజిరెడ్డి గారి వర్ధంతిని కూడా స్మరణ చేసుకొని ఆయన ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని గురువులందరు ఫాదర్ గారి ఆత్మ శాంతి కోసం ప్రార్ధించారు. ఈ  వడకంలో మద్దికెర విచారణ కర్తలు గురుశ్రీ జార్జి గారు చక్కటి దైవ వాక్కును తోటి గురువులతో పంచుకొని గురువులు దేవునియొక్క సేవలో ఏ విధంగా, పదిలంగా ఉండి దైవ ప్రజలను దేవునివైపు నడిపించాలని తన ప్రసంగంలో వివరించారు. ఆలూరి విచారణ కర్తలు గురుశ్రీ జ్ఞానా ప్రకాష్ గారు గురు జీవితం గురించి అద్భుతమైన వాక్కును తోటి గురువులతో పంచుకున్నారు. వీర్పాపురం విచారణకర్తలు గురుశ్రీ పొలిశెట్టి ఇన్నయ్య గారు మరియు ప్రేమ్ కుమార్ గారు వడకానికి వచ్చినటువంటి గురువులకు తమ విచారణ వీర్పాపురంలో చక్కటి వసతుల్ని ఏర్పాటు చేసి గురువులు ఆధ్యాత్మికంగా వడకంలో పాల్గొనడానికి వారి యొక్క సహాయసహకారాలని అందించారు. 29వ తేదీన పునీత పేతురు, పౌలు గార్ల పండుగ సందర్భంగా ఎమ్మిగనూరు విచారణ కర్తలు గురుశ్రీ చిన్నప్ప గారు తమ యొక్క పాలక పునీతులైన పౌలు గారి పండుగను ఘనంగా కొనియాడారు.     ఆదోని డీన్ గురువులు గురుశ్రీ కోలా విజయరాజు గారు వడకంలో పాల్గొన్న గురువులందరికి ధన్యవాదాలు తెలియజేశారు.

Add new comment

6 + 0 =