ఆదిలాబాద్ మేత్రాసనంలో మొదటి దివ్యసత్ప్రసాద స్వీకరణ.

ఆదిలాబాద్ మేత్రాసనం,సిర్పూర్ కాగజ్‌నగర్‌, ఫాతిమా మాత దేవాలయము నందు 31జూలై 2022 న విచారణ బాలబాలికలు మరియు విశ్వాసులు దివ్యసత్ప్రసాదాన్ని స్వీకరించారు.

ఆదిలాబాద్ పీఠాధిపతులు మహా పూజ్య. ప్రిన్స్ అంతోని తండ్రిగారు దివ్యబలిపూజను సమర్పించారు.

సిర్పూర్ కాగజ్‌నగర్‌ విచారణ నుండి 24 మంది నూతన దివ్య సత్ప్రసాదము స్వీకరించారు.

విచారణ గురువు గురుశ్రీ.జోబి గారు, సహాయక విచారణ గురువు గురుశ్రీ. మాత్యు గారు, గురుశ్రీ జీజో గారు, గురుశ్రీ.జిన్సెన్ గారు పాల్గొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

విచారణ కర్తలు గురుశ్రీ జోబి గారు విచ్చేసిన పీఠాధిపతులవారిని, గురువులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఆదిలాబాద్ మేత్రాసనాన్ని ఆ దేవాది దేవుడు ఎల్లప్పుడు దీవించాలని అమృతవాణి రేడియో వెరితాస్ ఆసియ తెలుగు విభాగం వారు కోరుకుంటున్నారు

 

 

Add new comment

4 + 1 =