ఆదిలాబాద్ పీఠంలో ఎఫాతా ధ్యాన కేంద్ర ప్రారంభోత్సవం

ఆదిలాబాద్ పీఠం,అసిఫాబాద్ జిల్లా, రెబ్బెనలోని ఎఫాతా ధ్యాన కేంద్ర ప్రారంభోత్సవాన్ని జనవరి 6,2022  న జగద్గురువులు పరిశుద్ధ పాపుగారి భారత రాయబారులైన శ్రీశ్రీశ్రీ మహా ఘన.లియోపోల్డో  జరెల్లి గారు మరియు ఆదిలాబాద్ పీఠాధిపతులు మహా ఘన. ప్రిన్స్ అంతోని తండ్రి గారిచే ఆశీర్వదించి దివ్యబలి పూజను సమర్పించారు.

ఎఫ్ఫాతా: మార్కు సువార్త 7:34లో మూగ చెవిటి వానికి స్వస్థతనిస్తూ యేసు ప్రభువు పలికిన అరమాయిక్ పదమే ఎఫ్ఫాతా. “తెరువబడుము” అని ఈ పదానికి అర్థం . ఎఫ్ఫాతా అని పలుకగానే అతని చెవులు తెరువబడ్డాయి, నాలుక పట్టు సడలి తేలికగా మాట్లాడసాగాడు. అతను సంపూర్ణ స్వస్థతను, విడుదలను పొందుకున్నాడు. అదే విధంగా, ఎఫ్ఫాతా ధ్యాన కేంద్రమును సందర్శించు వారందరు దైవ వాక్య పరిచర్య ద్వారా సమృద్ధిగా జీవమును, పాపం మరియు దుష్టాత్మ శక్తుల నుండి విడుదలను పొందుటకు “తెరువబడుతారు”.

02 ఏప్రిల్ 2018 నాడు శంకుస్థాపన చేయబడి 28 మార్చి 2019 నాడు ఆరంభించబడిన ఈ ధ్యాన కేంద్ర ప్రాంగణంలో జపమాల తోట, 14 స్థలాలు, యాకోబు బావి, రక్షణ చరిత్ర వంటివి కుడా నిర్మిమించారు.
ఈ ధ్యాన కేంద్రం నిర్మాణానికి ఆర్థిక సహాయమందించిన దాతలను, విశ్వాసులందరిని  మేత్రానులు అభినందించి ఆశీర్వదించారు.  ఎఫాతా ధ్యానకేంద్ర డైరెక్టర్రె గురుశ్రీ కుర్యన్ పొన్మలకున్నెల్ గారు విచ్చేసిన అందరికి కృతజ్ఞతలు తెలియచేసారు.

Add new comment

1 + 4 =