ఆగ్రా చేరిన రేమండ్ గారి సైకిల్ యాత్ర

సైకిల్ యాత్రరేమండ్

హైదరాబాద్ కు చెందిన రేమండ్ అనే యువకుడు మరియమాత గొప్పతనాన్ని చాటుతూ 1 మే 2022 న సైకిల్ యాత్రను ప్రారంభించారు.

దేశ రాజధాని అయిన ఢిల్లీ నుండి ఈ యాత్రను ఆయన ప్రారంభించారు. ఈ యాత్రలో ఆయన భారతదేశంలోని మరియమాత పుణ్యక్షేత్రాలను సందర్శించాలని, తద్వారా మరియతల్లి గొప్పతనాన్ని విశ్వాసులకు చాటుతూ ఆ తల్లి అడుగుజాడలలో అందరు క్రీస్తు ప్రభువును అనుసరించాలని ఆయన ఆకాంక్షిస్తున్నట్లు ఒక ముఖాముఖి కార్యక్రమంలో ఆయన వెల్లడించారు.

ఢిల్లీ నుండి ఈ యాత్రను ప్రారంభించిన ఆయన ఉత్తరప్రదేశ్ లోని మరియతల్లి బాసిలికాను సందర్శించారు. 

ఎటువంటి అవాంతరాలు లేకుండా ఆయన యాత్ర కొనసాగాలని కోరుకుంటూ అమృతవాణి మరియు రేడియో వెరితాస్ ఆసియ తెలుగు విభాగం వారి నుండి రేమండ్ గారికి అభినందనలు

Add new comment

11 + 4 =