ఆంధ్రప్రదేశ్ జ్యోతిర్మయి సంస్థకు నూతన కార్యదర్శిగా గురుశ్రీ మాదాను అంథోని.

ఆంధ్రప్రదేశ్ జ్యోతిర్మయి సంస్థకు నూతన కార్యదర్శిగా గత ఏడు  సంవత్సరాలుగా తమ అమూల్యమైన సేవను అందించిన గురుశ్రీ యం సోలోమన్ రాజు గారు తన పదవీ కాలనీ పూర్తిచేసుకున్నారు. గురుశ్రీ యం సోలోమన్ రాజు గారు శ్రీకాకుళం పీఠానికి చెందినవారు.
 
ఈ బాధ్యత అప్పగింపుల కార్యక్రమంలో జ్యోతిర్మయి అధ్యక్షులు మహా పూజ్య మల్లవరపు ప్రకాష్ తండ్రి గారు, జ్యోతిర్మయి ఉపాఅధ్యక్షులు మహా పూజ్య తెలగతోటి రాజారావు తండ్రి గారి ఆధ్వర్యంలో జరిగాయి.

టీసీబీసీ క్యాంపస్ లో ఉన్న గురువులంతా ప్రత్యేక ఆరాధనలో పాల్గొన గొప్పగా సేవలందించినటువంటి గురుపుంగవులను దేవునికి సమర్పిస్తూ రాబోవు కాలంలో కూడా వారిని దేవుడు దీవించి కాపాడాలని ప్రార్థిస్తూ నూతనగా పదవిని స్వీకరించిన గురువులను దేవుడు తమ పాద సేవలో పదిలము చేయాలని ప్రార్ధించారు.

ఆంధ్రప్రదేశ్ జ్యోతిర్మయి సంస్థకు నూతన కార్యదర్శి గురుశ్రీ మాదాను అంథోని గారు భాద్యతను స్వీకరించారు. గురుశ్రీ మాదాను అంథోని గారు హైదరాబాద్ అగ్రపీఠానికి చెందినవారు.

Add new comment

1 + 0 =