ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది.  ఈ ప్రభావంతో రాగల 48 గంటల్లో భారీ వర్షాలు పడనున్నాయి. అల్పపీడన ద్రోణి ప్రభావం తమిళనాడుతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ తీవ్రంగా ఉంది. ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు, భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.  సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉందని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ఏపీలోని తీర ప్రాంతాల్లోని జిల్లాలకు రెడ్‌ అలర్ట్ ప్రకటించారు.అవసరమైన చోట సహాయ శిబిరాలు తెరవాలని, బాధితులకు వేయి రూపాయల చొప్పున వారికి అందించాలని, అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా చూసుకోవాలని, అలాగే  బాధితులకోసం ఒక ఫోన్‌ నంబర్‌ను అందుబాటులో ఉంచండి అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

 

 

 

Add new comment

1 + 0 =