అస్సిస్సి లోని పునీత ఫ్రాన్సిస్ వారి దేవాలయం నుండి తన మూడవ విశ్వలేఖను విడుదల చేసిన పోప్ ఫ్రాన్సిస్.

Fratelli TuttiFratelli Tutti

అస్సిస్సి లోని పునీత ఫ్రాన్సిస్ వారి దేవాలయం నుండి తన మూడవ విశ్వలేఖను విడుదల చేసిన పోప్ ఫ్రాన్సిస్.

Fratelli Tutti  అనే తన విశ్వ లేఖను ఫ్రాన్సిస్ పోప్ గారు అక్టోబర్ 3 , 2020 న తన చేవ్రాలతో విడుదల చేసారు.  ఈ లేఖ లో కరోనా మహమ్మారి మనల్ని అతలాకుతలం చేసిన అనంతరం మనం పర్యవసానాలను ఎలా ఎదుర్కోవాలో పోప్ గారు వివరించారు.

కరోనా వల్ల  ఇన్నాళ్లు  తన గృహానికే పరిమితమైన పోప్ గారు మొదటి సారిగా అస్సిస్సి కి పయనమై ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

మొదట పోప్ గారు అక్కడి పునీత ఫ్రాన్సిస్ గారి దేవాలయంలో దివ్యపూజను అర్పించారు. పోప్ గారి ఆజ్ఞ మేరకు ఈ కార్యక్రమానికి విశ్వాసులెవ్వరికి అనుమతి ఇవ్వలేదు. “Laudato si' మరియు “Lumen Fidei.” లేఖల అనంతరం “Fratelli Tutti,” పోప్ గారి మూడవ విశ్వాలేఖ. “Fratelli Tutti,” అంటే "సహోదరులందరు కలిసి"అని అర్ధము. దీనికి ముందు లేఖ అయిన “Laudato si' ఇటలీ భాషకు చెందిన పదం కాగా, పోప్ గారు ఈ సారి కూడా తన విశ్వ లేఖకు ఇటలీ భాషలోనే పేరు పెట్టారు.

ఈ నగరం లోని పునీత ఫ్రాన్సిస్ వారి దేవాలయాన్ని ఫ్రాన్సిస్ పోప్ గారు సందర్శించడం ఇది నాల్గవసారి కావడంతో ఈ దేవాలయానికి విశేష ప్రాముఖ్యత సంతరించుకొంది.

Add new comment

1 + 0 =