అస్సిసి మరియు మాటేరా నగరాలను సందర్శిచనున్న ఫ్రాన్సిస్ పాపు గారు

అస్సిసి మరియు మాటేరా నగరాలను సందర్శిచనున్న ఫ్రాన్సిస్ పాపు గారు.  

 ఇటాలియన్ పట్టణమైన అస్సిసి నగరంలో ఎకానమీ ఆఫ్ ఫ్రాన్సిస్కో ఈవెంట్ కోసం మరియు 27వ జాతీయ యూకారిస్టిక్ కాంగ్రెస్ ముగింపు సమావేశం కోసం మటేరా నగరాన్ని సెప్టెంబర్ చివరిలో సందర్శిస్తానని పాపు గారు తెలియజేశారు.

ఈ పర్యటన ఫ్రాన్సిస్ గారు అస్సిసికి చేసే ఆరవ పర్యటన. 'ఎకానమీ ఆఫ్ ఫ్రాన్సిస్కో' ఈవెంట్‌ అనేది యువ ఆర్థికవేత్తలు, వ్యవస్థాపకులు మరియు విభిన్నమైన ఆర్థిక వ్యవస్థ గురించి ఆలోచించడం మరియు సాధన చేయడంలో నిమగ్నమై ఉన్న మార్పు-మేకర్ల కోసం ఉద్దేశించిన అంతర్జాతీయ సదస్సు. 24 సెప్టెంబర్ 2022 శనివారం రోజున ఉదయం 10:00 గంటలకు అస్సిసిలో ఫ్రాన్సిస్ గారు యువకులతో సమావేశమై వారితో సంభాషాషించనున్నారు.

25 సెప్టెంబర్ 2022 ఆదివారం రోజున ఉదయం 10:00 గంటలకు 27వ జాతీయ యూకారిస్టిక్ కాంగ్రెస్ ముగింపు సమావేశం సందర్భంగా దక్షిణ ఇటాలియన్ ప్రాంతంలోని బాసిలికాటాలోని మాటెరా నగరానికి పవిత్ర తండ్రి పర్యటిస్తున్నారు .ఆ రోజున వలస వచ్చినవారిని మరియు శరణార్థులను పాపు గారు కలవనున్నారు.

బోలోగ్నా అగ్రపీఠాధిపతులు, ఇటాలియన్ బిషప్స్ కాన్ఫరెన్స్ అధ్యక్షులైన కార్డినల్ మాటియో జుప్పి గారు మరియు  అస్సిసి-నోసెరా ఉంబ్రా-గ్వాల్డో టాడినో పీఠాధిపతులు, ఫ్రాన్సిస్కో ఆర్థిక వ్యవస్థ యొక్క కమిటీ అధ్యక్షులైన అగ్రపీఠాధిపతులు డొమెనికో సోరెంటినో గార్లు సమావేశాలు జరిగే రెండు రోజులు పరిశుద్ధ పాపు గారితో కలిసి పర్యటన చేసే అవకాశాన్ని కల్పించినందుకు పవిత్ర తండ్రికి తమ కృతజ్ఞతలను తెలియజేశారు.

Add new comment

9 + 11 =